Begin typing your search above and press return to search.

క‌ల‌వ‌ర పెడుతున్న జ‌గ‌న్ 'మాసిజం'....!

ఇవ‌న్నీ ఎవ‌రో చెప్పిన లెక్కలు కాదు.. సాక్షాత్తూ.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు, ఐటీడీపీ చీఫ్‌లు వేస్తున్న అంచ‌నా.. చూస్తున్న లెక్క‌లు కూడా!.

By:  Tupaki Desk   |   13 July 2025 1:00 AM IST
క‌ల‌వ‌ర పెడుతున్న జ‌గ‌న్ మాసిజం....!
X

కొన్ని విష‌యాలు రాజ‌కీయంగా ఆస‌క్తిని రేపుతాయి. ఇలాంటి వాటిలో వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హారం ఒక‌టి. టీడీపీ అభిమానులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా.. కొన్ని కొన్ని విషయాల‌ను కాద‌న‌లేని విధం గా ఒప్పుకొనే అంశాల్లో జ‌గ‌న్ ఒక‌రు!. ఇది వాస్త‌వం. అంతేకాదు.. రాజ‌కీయంగా త‌మ ప్ర‌త్య‌ర్థే అయినా.. రాజ‌కీయంగా త‌మ‌కు శ‌త్రువే అయినా.. జ‌గ‌న్ చేస్తున్న ప‌నులు, జ‌గ‌న్ స‌భ‌ల‌కు, స‌మావేశాల‌కు వ‌స్తున్న జ‌నాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు టీడీపీనాయ‌కులు, మంత్రులు కూడా ప‌సిగ‌డుతూనే ఉన్నారు.

ఇటీవ‌ల కూట‌మి ప్ర‌భుత్వానికి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబుప‌లు చానెళ్ల‌కు ఇంట ర్వ్యూలు ఇచ్చారు. వీటిని లైవ్‌లో ప్ర‌సారం చేశారు. కొన్ని యూట్యూబ్‌లోనూ ఉన్నాయి. అయితే.. వీటికి వ‌చ్చిన వ్యూస్‌.. ల‌క్ష‌-ల‌క్ష‌న్న‌ర‌లోపే కావ‌డం గ‌మ‌నార్హం. కానీ.. జ‌గ‌న్ మొన్నామ‌ధ్య‌.. 40 నిమిషాల పాటు ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ మీడియా స‌మావేశానికి కొద్దిమందినే ఆహ్వానించారు. అయితే.. ప్రెస్ మీట్‌ను ఏకంగా.. 15-20 ల‌క్ష‌ల మంది వీక్షించారు.

ఇవ‌న్నీ ఎవ‌రో చెప్పిన లెక్కలు కాదు.. సాక్షాత్తూ.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు, ఐటీడీపీ చీఫ్‌లు వేస్తున్న అంచ‌నా.. చూస్తున్న లెక్క‌లు కూడా!. ఇక‌, జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌స్తే.. మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాద న్న‌ట్టుగా జ‌నాలు కుప్ప‌లు తెప్ప‌లుగా త‌ర‌లి వ‌స్తున్నారు. వీరిని అదుపు చేయ‌డం వైసీపీ వ‌ల్లే కావ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. తాజాగా చిత్తూరు జిల్లా కావొచ్చు. గ‌తంలో పొదిలి, గుంటూరు కావొచ్చు. మాసిజంలో జ‌గ‌న్ కు అడ్డుక‌ట్ట వేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

మ‌రోవైపు.. ఈ మాస్ జ‌నాలే.. రేపు ఓట‌ర్లుగా మారేది. క్లాస్ ఉన్నా.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఉన్నా.. ఏదైనాతేడా కొడితే .. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం పోలింగ్ బూతుల వైపు తొంగి కూడా చూడ‌దు. ఒక్క‌మాస్‌మాత్రమే రెచ్చిపోయి ఓటె త్తుతారు. ఇది కూడా టీడీపీలో ఒకింత ఇబ్బందిగానే ఉంది. అందుకే.. జ‌గ‌న్ `మాసిజం` రాజ‌కీయాల‌ను అత్యంత స‌న్నిహితంగా నాయ‌కులు మంత్రులు కూడా గ‌మ‌నిస్తున్నారు. ఈ కార‌ణంగానే.. జ‌గ‌న్‌ను బ‌లంగా ఎదుర్కొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. ఇతర అంశాల‌ను జోడించ‌లేక పోతున్నారు. సో.. మొత్తంగా.. జ‌గ‌న్ మాసిజం ఒక ర‌కంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిందనేదివాస్త‌వం.