భారతి చుట్టూ.. ఇంట్రస్టింగ్ డిబేట్.. విషయం ఏంటి ..!
వైసీపీ అధినేత జగన్ జైలుకు వెళ్తారా? అంటే.. రాజకీయ వర్గాల్లో ఔననే చర్చ కనిపిస్తోంది. ఇదే జరిగితే.. వైసీపీ నాయకత్వ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది చర్చగా మారింది.
By: Tupaki Desk | 24 May 2025 11:00 PM ISTవైసీపీ అధినేత జగన్ జైలుకు వెళ్తారా? అంటే.. రాజకీయ వర్గాల్లో ఔననే చర్చ కనిపిస్తోంది. ఇదే జరిగితే.. వైసీపీ నాయకత్వ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది చర్చగా మారింది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లినప్పుడు వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ ఉన్నారు. ఇక, సోదరి షర్మిల కూడా .. పార్టీని ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. పాదయాత్ర చేశారు. పార్టీపై సింపతీ తగ్గకుండా చూసుకున్నారు.
కానీ, ఇప్పుడు తల్లి-చెల్లి ఇద్దరూ దూరంగానే ఉన్నారు. తల్లికి అనారోగ్యం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఆమె రాజకీయంగా యాక్టివ్ కాలేని పరిస్థితి నెలకొంది. ఇక, షర్మిల వేరే పార్టీకి చీఫ్ గా ఉన్నారు. పైగా ఆస్తుల వివాదంలో అన్నపైనే ఆమె కాలుదువ్వుతున్నారు. మొత్తంగా పార్టీకి ఒకప్పుడు మూల స్థంభాలుగా ఉన్న ఈ ఇద్దరు కూడా ఇప్పుడు దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పగ్గాలు ఎవరు మోస్తారు? అనేది చర్చ.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో నాయకుల సతీమణులు ముందుకు వస్తారు. వారే పార్టీ తరఫున వా యిస్ వినిపిస్తారు. గతంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి రంగంలోకి దిగా రు. ప్రచారం చేశారు. మహిళల సానుభూతిని కైవసం చేసుకున్నారు. తద్వారా.. పార్టీకి అండగా ఉన్నారు. అయితే.. ఆమెకు అన్నగారు ఎన్టీఆర్ కుమార్తెగా పెద్ద ఎత్తున గుర్తింపు ఉండడం.. కూడా కలిసి వచ్చింది.
ఇక, ఇప్పుడు జగన్ సతీమణి భారతి కూడా బయటకు వస్తారా? అనేది చర్చ. ఒకవేళ వచ్చినా..ఆమె ఏమే రకు ప్రజలను ఆకట్టుకుంటారు? అనేది చర్చ. ఎందుకంటే.. ఇప్పటి వరకుకూడా భారతి ఇంటి గడప దాట లేదు. పైగా.. పదిమందిలోకి వచ్చి మాట్లాడిన అనుభవమూ లేదు. తన వ్యాపారాలు.. తన వ్యవహారా లు చూసుకోవడంలోనే ఆమె బిజీగా ఉన్నారు. అలాంటి ది ఇప్పుడు అకస్మాత్తుగా రాజకీయ అరంగేట్రం చేసి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి. ఇదంతా ప్రస్తుతం చర్చే. జగన్ అరెస్టయితే.. ఏం జరుగుతుం దన్న దానిపై ఎవరి ఊహాగానాలు వారివి. మరి చూడాలి ఏం జరుగుతుందో.
