Begin typing your search above and press return to search.

జగన్ అసెంబ్లీకి రావాలని మొక్కుకుంటున్న సోషల్ మీడియా జనాలు !

తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ వచ్చారు. దాంతో ఏపీ అసెంబ్లీ చప్ప చప్పగా ఏకపక్షంగానే సాగుతోంది.

By:  Satya P   |   26 Aug 2025 7:00 PM IST
జగన్ అసెంబ్లీకి రావాలని మొక్కుకుంటున్న సోషల్ మీడియా జనాలు  !
X

సోషల్ మీడియాకి కొత్త విషయాలు కావాలి. వాటిని వైరల్ చేయడం కావాలి. అయితే సినీ రాజకీయ రంగాలలోనే ఎప్పటికపుడు ఎక్కువ విషయాలు ఉంటాయి అలాగే ఈ రెండు రంగాలలోనే సెలిబ్రిటీలు ఉంటారు. వారికి ఎంతో మంది అభిమానులు ఉంటారు. అదే విధంగా దురభిమానులు కూడా ఉంటారు. దాంతో సోషల్ మీడియాలో వారికి సంబంధించిన విషయాలు పెడితేనే ఆ పోస్టులకు యమ డిమాండ్ ఉంటుంది. అంతే కాదు చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా జనాలు అయితె ఇపుడు ఒకే ఒక విషయం మీద గట్టిగా కోరుకుంటున్నాయని అంటున్నారు. ఆయన రావాలని వేయి దండాలు పెట్టుకుంటూ కోటి మొక్కులు కూడా చెల్లించుకుంటామని చెబుతున్నాయట. ఇంతకీ ఎవరాయన ఏమా స్పెషల్ అంటే చాలానే ఉంది మ్యాటర్ ఇక్కడ.

జగన్ అసెంబ్లీకి రావాలి :

మామూలుగా అయితే జగన్ అసెంబ్లీకి రావడంతో విశేషం ఏమీ లేదు. ఆయన ఎమ్మెల్యే, మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు. అందువల్ల అసెంబ్లీకి వస్తే అందులో వింతా విడ్డూరం ఏమీ లేదు కానీ జగన్ గత పదిహేను నెలలుగా అసెంబ్లీకి రావడం లేదు. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ వచ్చారు. దాంతో ఏపీ అసెంబ్లీ చప్ప చప్పగా ఏకపక్షంగానే సాగుతోంది. ఎక్కడ అయినా చట్ట సభలలో ప్రతిపక్షం ఉంటేనే మంచి రాజకీయ వేడి ఉంటుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ రచ్చ సాగితే అది ఎక్కువ సంచలనం అవుతుంది. అందుకే జగన్ అసెంబ్లీకి రావాలని సాదర జనాల కంటే సోషల్ మీడియా జనాలు ఎక్కువగా కోరుకుంటున్నాయని అంటున్నారు.

బోలెడంత కంటెంట్ తో :

అవును జగన్ అసెంబ్లీకి వస్తే బోలెడు కంటెంట్ సోషల్ మీడియాకు దొరుకుతుంది అని అంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు రాజకీయ మసాలా వార్తలు దొరుకుతాయి. అంతే కాదు యూ ట్యూబర్స్ కి సోషల్ మీడియాకి సైతం కంటెంట్ కి ఎక్కడ లేని విధంగా దొరుకుతుంది అని అంటున్నారు. వైసీపీకి కూడా ఇది మంచి పరిణామం గానే ఉంటుంది అని అంటున్నారు. ఇప్పటిదాకా వైసీపీ తనకు తానుగానే సోషల్ మీడియాలో పోస్టులతో హడావుడి చేస్తోంది. ఇపుడు మొత్తం సోషల్ మీడియా ప్రపంచమే జగన్ వైపు చూస్తుంది అని అంటున్నారు. జగన్ అన్న మూడు అక్షరాలతో ఏకంగా సోషల్ మీడియా షేక్ చేస్తుంది అని అంటున్నారు.

జగన్ టాప్ ప్లేస్ లోనా :

ఇప్పటిదాకా చూస్తే కనుక సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హైలెట్ అవుతూ వస్తున్నారు. ఒక్కసారి కనుక జగన్ అసెంబ్లీలో అడుగు పెడితే ఆయన చుట్టూనే సోషల్ మీడియా తిరుగుతుందని అంటున్నారు. జగన్ కి అనుకూలంగా లేదా ఆయనకు వ్యతిరేకంగా ఇలా రెండిందాలా జగనే సోషల్ మీడియాలో కనిపిస్తారు అని అంటున్నారు. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా డిబేట్లకు కూడా జగన్ కంటెంట్ ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు ఇప్పటిదాకా జరిగిన రాజకీయ చర్చలు ఒక ఎత్తుగా ఉంటాయని జగన్ అసెంబ్లీకి వస్తే అవి వేరే లెవెల్ లోకి వెళ్తాయని అంటున్నారు.

మీడియాలో ఫుల్ ఫోకస్ :

ఇప్పటికే తెలుగు మీడియా రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జగన్ కి వ్యతిరేక వార్తలు వస్తాయి. అయితే ఆ వార్తలకు కూడా ఇపుడు జగన్ అసెంబ్లీకి వెళ్తే మరింత కొత్తదనంతో కూడిన కంటెంట్ దొరుకుతుంది అని అంటున్నారు. అలాగే జగన్ అనుకూల మీడియా తమ నాయకుడికి హైప్ ఇచ్చుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు.

ట్రెండింగ్ టాపిక్ గానా :

సోషల్ మీడియాకు ఎప్పటికి అపుడు ట్రెండింగ్ టాపిక్ అంటూ కొత్తవి కావాలి. ఇక ఏపీ పాలిటిక్స్ లో జగన్ కొత్త ట్రెండింగ్ టాపిక్ అవుతారు అని అంటున్నారు. ఆయన అసెంబ్లీలో ఏమి చేసినా కంటెంట్ కి ఎక్కడా ఢోకా ఉండదని అంటున్నారు. ఇలా జగన్ మీద ట్రోల్స్ వచ్చేవి ఉంటాయి. ఫేవర్ గా వచ్చేవి ఉంటాయి. ప్లస్ మైనస్ ఏదైనా ఓవరాల్ గా చూస్తే మాత్రం జగన్ అన్న కంటెంట్ మాత్రం మీడియాని మొత్తం ఊపేస్తుంది అందుకే వారంతా జగన్ అసెంబ్లీకి రావాలని మొక్కులే మొక్కుతున్నారు అని అంటున్నారు. ఇంతకీ జగన్ అసెంబ్లీకి వస్తున్నారా. ఏమో దీని గురించి తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.