హలో ఇండియా... జగన్ ప్లాన్ ఏంటి ?
వైసీపీ అధినేత జగన్ హలో ఇండియా అంటూ ఒక అతి పెద్ద ట్వీట్ పెట్టారు. అందులో ఏపీలో లా అండ్ ఆర్డర్ ని ఫియర్ భర్తీ చేస్తోంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
By: Satya P | 21 Jun 2026 10:24 AM ISTవైసీపీ అధినేత జగన్ హలో ఇండియా అంటూ ఒక అతి పెద్ద ట్వీట్ పెట్టారు. అందులో ఏపీలో లా అండ్ ఆర్డర్ ని ఫియర్ భర్తీ చేస్తోంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. చట్ట పాలన స్థానంలో భయం పాలన వచ్చిందని ఆయన అభివర్ణించారు. పౌర సమాజం భయంతో బతుకుతోంది అంటూ జగన్ చేసిన ట్వీట్ ఉంది. భయపెట్టే పాలన సాగుతోంది హలో ఇండియా అని జగన్ అంటున్నారు
లేటెస్ట్ ఇన్సిడెంట్స్ తో :
తాజాగా ఏపీలో సాయి క్రిష్ణ లాకప్ డెత్ కేసుని ఆయన తన ట్వీట్ లో ఉటంకించారు. అలాగే పోలీసుల వేధింపులు భరించలేక సెల్ఫీ తీసి మరీ ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ ఇష్యూని కూడా ఆయన ఉదహరించారు. రెడ్ బుక్ రాజ్యాంగమని భయమే పోలీసింగ్ కి చిహ్నమని జగన్ కామెంట్స్ చేశారు. పోలీసు వ్యవస్థ మీదనే జగన్ విమర్శలు ఇందులో కనిపిస్తున్నాయి. కొందరి వ్యక్తులు తమ చేతుల్లోకి చట్టాలని తీసుకుంటున్నారని ఆయన ఆరోపించడం విశేషం.
పౌర సమాజానికి కూడా :
రాజకీయ వేధింపులు కాస్తా పౌర సమాజానికి కూడా వేధింపులు చేసే స్థాయి దాకా వ్యవహారం వెళ్తోంది అని జగన్ అంటున్నారు. పోలీసుల వేధింపులు రెడ్ బుక్ రాజ్యాంగం భయం చట్టం కొందరి చేతుల్లోకి మారింది ఇలా జగన్ విమర్శలు ఆరోపణలతో ఆయన ట్వీట్ మొత్తం సాగింది. అయితే జగన్ ఈ విమర్శలను ఎపుడూ చేస్తూంటారు. కానీ ఈసారి హలో ఇండియా అంటూ దేశానికి పిలుపు ఇచ్చేలా ఈ ట్వీట్ వేయడమే చర్చగా సాగుతోంది.
ఏమి చెప్పదలచారు
ఈ ట్వీట్ ద్వారా జగన్ ఏమి చెప్పదలచారు అంటే ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని ఆరోపిస్తున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తున్న విషయమే. అయితే అది ఏపీకే పరిమితం అయిన ట్వీట్ గా లేదు, హలో ఇండియా అంటున్నారు. అంటే ఈ ఇష్యూని జాతీయ స్థాయిలో తీసుకుని వెళ్లే అజెండా ఏమైనా జగన్ కి ఉందా అన్నదే అంతా ఆలోచిస్తున్న విషయం. ఇక గతంలో చూస్తే కూటమి ప్రభుత్వం గద్దె నెక్కి రెండు నెలలు కూడా కాకముందే జగన్ ఢిల్లీ వెళ్లారు. ఏపీలో కూటమి నేతల రాజకీయ వేధింపులు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఆనాడు ఆయన ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించారు. మరి దాని తరువాత ఆయన ఈ తరహా ఆందోళనలు జాతీయ స్థాయిలో చేసినది లేదు. ఇన్నాళ్ళకు ఆయన హలో ఇండియా అంటున్నారు అంటే మళ్లీ ఢిల్లీని వేదికగా చేసుకుని ఈ అంశాల మీద ఆందోళనలు చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది.
జాతీయ స్థాయిలోనే :
ఇక ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పాలనే హలో ఇండియా అని జగన్ ట్వీట్ లోనే ఒక పిలుపు ఇచ్చారు. ఇలా ట్వీట్ ద్వారా నెటిజన్ల దృష్టికి ఈ విషయం చేరవేయడం ఒక ఎత్తు అయితే దానికి మించి జాతీయ స్థాయిలో వైసీపీ ఏమైనా యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తోందా అన్నదే ఇపుడు అనుకుంటున్న విషయం. ఈ రోజున కాక్రోచ్ పార్టీ పేరుతో ఆందోళనలు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నాయి. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఒక భారీ రాజకీయ విభజనకు తెర వెనక సన్నాహాలు జరుగుతున్నాయి. ఇండియా కూటమి బలోపేతం కావాలని ఆ కూటమి పెద్దలు ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది. వీటి నడుమ వైసీపీ కనుక ఏపీలో అంశాలను ఢిల్లీ వేదికగా జాతీయ స్థాయిలో ప్రజెంట్ చేసేందుకు ఏమైనా రెడీ అవుతోందా అన్నదే కీలకమైన చర్చ. అదే కనుక జరిగితే ఏపీ పాలిటిక్స్ కొత్త మలుపు తిరగడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి హలో ఇండియా అని జగన్ ఇచ్చిన పిలుపు వెనక నయా వ్యూహం ఏమి ఉందో.
