జగన్ చేతికి కొత్త రింగ్.. అచ్చం బాబు మాదిరే!
దీనిపై పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పుకొచ్చారు కూడా. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని కలిసినా కూడా.. ఆయన ఈ రింగుతోనే ఉంటున్నారు.
By: Tupaki Desk | 19 Jun 2025 3:22 PM ISTఏపీ సీఎం చంద్రబాబు చేతికి ఓ రింగు ఉంటుంది. ఇదేమీ బంగారంతో చేసిన ఉంగరం కాదు.. ఆయనేమీ బంగారం ధరించాలన్న పట్టుదలతోనూ పెట్టుకోలేదు. ఇది ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే రింగ్. దీనికి సంబంధించిన డివైజ్ పార్టీ కార్యాలయంలోనూ.. ఆయన ఇంట్లోనూ కూడా ఉంటుంది. దీని ద్వారా చంద్రబాబు ఆరోగ్యంలో చోటుచేసుకునే మార్పులు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. తీసుకునే ఆహారం నుంచి తాగే నీరు వరకు అన్నింటినీ ఈ రింగ్ నిశితంగా పరిశీలిస్తుంది.
దీనిపై పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పుకొచ్చారు కూడా. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని కలిసినా కూడా.. ఆయన ఈ రింగుతోనే ఉంటున్నారు. అచ్చంగా ఇలానే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ చేతికి కూడా ఓ రింగు కనిపించింది. ఇలా ఆయన చేతికి రింగు కనిపించడం ఇదే తొలిసారి. చంద్రబాబు చేతికి గడియారం ఉండదు. కానీ... జగన్ చేతికి గడియారం ఉంటుంది. ఇక ఇద్దరి చేతులకు ఉంగరాలు.. ఒకప్పుడు ఉండేవి కాదు. కానీ, చంద్రబాబు ఆరోగ్యం కోసం.. రింగును పెట్టుకుంటున్న విషయం తెలిసిందే.
తాజాగా జగన్ చేతికి కూడా అలాంటి రింగేపెట్టుకుని తాజాగా కనిపించారు. ఎడమ చేతి మధ్య వేలికి `హెల్త్ ట్రాకర్ రింగ్` పెట్టుకోవడంతో అందరి దృష్టీ దానిపై నే పడింది. గతంలో ఎప్పుడూ జగన్ చేతికి ఉంగరం లేకపోవడం.. ఇప్పుడే కనిపించడం అది కూడా ఆరోగ్యాన్ని బేరీజు వేసే రింగే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. చంద్రబాబు కంటే కూడా జగన్ వయసు 25 ఏళ్లు తక్కువ. అయినా.. ఆయన ఇలా రింగు ధరించడం ఎందుకు? ఏదైనా ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
