బిగ్ డౌట్: ఇప్పటికీ కేసీఆర్ చెప్పినట్టే జగన్ చేస్తున్నారా.. ?
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ .. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టే వింటున్నారా? ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
By: Tupaki Desk | 6 Jan 2026 6:00 PM ISTఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ .. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టే వింటున్నారా? ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇది.. ప్రత్యర్థి పార్టీల నుంచి వస్తున్న కామెంట్ కాదు. వైసీపీలోనే ఓ వర్గం నాయకులు చెబుతున్న మాట. గతంలో అధికారంలో ఉన్నప్పుడు.. వైసీపీ అధినేత.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విషయంలో కేసీఆర్ చెప్పినట్టే విన్నారన్న వాదన ఉంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ విషయంలో దీనిపై పెద్ద ఎత్తున యాగీ కూడా జరిగింది.
ఆ తర్వాత.. జగన్ భుజాన వేసుకున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపైనా కేసీఆర్ అభ్యంతరాలు చెప్పారు. దీంతో జగన్ విరమించుకున్నారన్న వాదన ఉంది. అదేవిధంగా అప్పట్లో కేసీఆర్ మనుషులు.. ఏపీలో చక్రం తిప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాంట్రాక్టులు తీసుకున్నారన్నది అందరికీ తెలిసిందే. ఒక రకంగా.. కేసీఆర్ ఏం చెబితే అదే చేశారు. అంతేకాదు.. కేసీఆర్ చెప్పారనే.. అప్పట్లో షర్మిల పార్టీ పెట్టినప్పుడు వైసీపీ హుటాహుటిన స్పందించి.. తమకు సంబంధం లేదని పేర్కొంది.
ఇక, రెడ్డి సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్‌కు చేరువ చేసేందుకు కూడా వైసీపీ తన ప్రయత్నాలు తాను చేసింది. ఇలా.. అనేక సందర్భాల్లో కేసీఆర్ చెప్పినట్టే వైసీపీ నడిచిందన్న వాదన వినిపించింది. ఇక, ఇప్పుడు రాజకీయంగా అవసరం ఉందో లేదో.. తెలియదు కానీ.. కేసీఆర్ చెప్పినట్టే మరోసారి వైసీపీ నడుస్తోందన్న వాదన సొంత పార్టీలోనే ఎక్కువగా వినిపిస్తుండడం గమనార్హం. తాజాగా జల వివాదాలపై.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని అనుకున్నారు.
కానీ.. ఏపీలో ఈ వ్యవహారం మరింత ముదిరితే.. తెలంగాణలో కేసీఆర్‌కు మరింత ఇబ్బంది. అక్కడ మరిన్ని విషయాలను తవ్వి తీసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాచుకుని కూర్చుంది. ఒకరకంగా రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా జల వివాదాలను ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని తమకు అను కూలంగా మలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ.. జగన్ దీనిని పక్కన పెట్టేశారు. పార్టీలోనూ నాయకులు మౌనంగా ఉండేలా ఆయన వ్యవహరించారు. దీనివెనుక కూడా కేసీఆర్ ఉన్నారన్నది వైసీపీ నేతల గుసగుస. మరి ఏం చేస్తారోచూడాలి.
