Begin typing your search above and press return to search.

లోకల్ ఫైట్ కి దూరంగా జగన్ అక్కడికి ?

ఎక్కడా ఏకగ్రీవాలు అన్నది ఉండరాదని కోరుతున్నారు. అలాంటి నేపధ్యంలో జగన్ వైసీపీ లోకల్ ఫైట్ లో ధీటుగా పోరాడేలా ఏ రకమైన వ్యూహాలను రూపొందిస్తారు అన్న చర్చ అయితే పార్టీ లోపలా బయటా కూడా సాగుతోంది.

By:  Satya P   |   20 Sept 2026 8:45 AM IST
లోకల్ ఫైట్ కి దూరంగా జగన్ అక్కడికి  ?
X

టీడీపీ కూటమి మీద అతి తక్కువ సమయంలోనే జనాలలో పూర్తి వ్యతిరేకత వచ్చిందని వైసీపీ అధినేత జగన్ గట్టిగా నమ్ముతున్నారు అంటున్నారు. ఆయన పార్టీ నాయకుల సమావేశంలో ఇదే విషయం పదే పదే చెబుతున్నారు కూడా. వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మధ్య తేడాను జనాలు బాగా అర్థం చేసుకున్నారని ప్రతీ ఇంట్లో ఇదే విషయం మీద చర్చ సాగుతోంది అని కూడా జగన్ అంటూంటారు. ఇక లోకల్ ఫైట్ లో వైసీపీ గట్టిగా నిలబడాలని ఆయన పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎక్కడా ఏకగ్రీవాలు అన్నది ఉండరాదని కోరుతున్నారు. అలాంటి నేపధ్యంలో జగన్ వైసీపీ లోకల్ ఫైట్ లో ధీటుగా పోరాడేలా ఏ రకమైన వ్యూహాలను రూపొందిస్తారు అన్న చర్చ అయితే పార్టీ లోపలా బయటా కూడా సాగుతోంది.

సవాల్ గా తీసుకుంటూ :

వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్ గా తీసుకోవాలని జగన్ కోరుతున్నారు. ఎక్కడా గివ్ అప్ ఇవ్వరాదని అంటే ఏకగ్రీవాల ప్రసక్తే ఉండరాదని జగన్ అంటున్నారు. మరి ఇంతలా జగన్ చెబుతున్న వేళ ఆయన స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో యాక్షన్ ప్లాన్ ఏమి రూపొందిస్తున్నారు అన్నది అయితే అంతటా ఆసక్తి ఉంది. ఈ చర్చ ఇలా ఉండగానే ఒక వార్త అయితే ఇపుడు పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది. అదే జగన్ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఏపీలోనే కాదు, దేశంలో అయినా ఉంటారా అన్నది. మరి ఎందుకు వచ్చింది ఈ సందేహం అంటే తాజాగా జగన్ యూరప్ టూర్ కి సీబీఐ కోర్టు అనుమతించడం.

పదిహేను రోజుల ట్రిప్ :

జగన్ చూస్తే యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు అని అంటున్నారు. ఆయన దీని కోసం సీబీఐ కోర్టు అనుమతి కోరితే కోర్టు అనుమతించింది. ఆయన ఏకంగా పదిహేను రోజుల పాటు యూరప్ లో టూర్ చేయబోతున్నారు. అది కూడా అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్యలో. అంటే రెండు నెలలలో ఎపుడైనా ఒక పది హేను రోజుల పాటు జగన్ ఏపీలో ఉండరన్న మాట. మరి చూడబోతే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇవే నెలలలో ఉన్నాయని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అయితే ఏపీలో మూడు విడతలుగా లోకల్ బాడీస్ కి ఎన్నికలు జరిపించడానికి చూస్తోంది. అవి అక్టోబర్ నుంచే మొదలవుతాయి అని అంటున్నారు. అక్టోబర్ లో కార్పోరేషన్, మునిసిపల్ ఎన్నికలు ఉంటాయి. ఆ వెంటనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఆ మీదట పంచాయతీలకు ఎన్నికలు ఇవన్నీ పూర్తి కావాలంటే నవంబర్ నెల కూడా పడుతుంది అని అంటున్నారు.

ఊహాగానాలు అలా :

మరి జగన్ యూరప్ టూర్ అన్నది కచ్చితంగా ఇవే నెలలలో ఉంటుంది అన్నది కోర్టు ఇచ్చిన అనుమతితో తేలిపోయింది. మరి జగన్ లేకుండానే ఏపీలో లోకల్ ఫైట్ కి వైసీపీ శ్రేణులు సిద్ధపడతాయా అన్నది ఇపుడు పెద్ద ఎత్తున చర్చగా ఉంటోంది. మరి జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటున్నారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. అయితే జగన్ యూరప్ టూర్ కి లోకల్ బాడీ ఎన్నికలకు మధ్య ఇబ్బంది రాకుండానే ప్లాన్ చేసుకుంటారు అని మరో ప్రచారం కూడా ఉంది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయితే నెలన్నరలో మొత్తం మూడు దశల ఘట్టం పూర్తి అవుతుందని అంటున్నారు. దాంతో నవంబర్ నెల రెండో వారంలో అయినా జగన్ యూరప్ టూర్ ఉండొచ్చు అని అంటున్నారు. అందువల్ల లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ ని బట్టి జగన్ విదేశీ పర్యటన అన్నది డేట్ ఫిక్స్ చేసుకుంటారు అని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే జగన్ చాలా కాలానికి విదేశీ యాత్ర పెట్టుకున్నారు. అదే సమయంలో లోకల్ బాడీ ఎన్నికలు ఉండడం అంటే కొంత చర్చగానే ఉంది. చూడాలి మరి ఈ రెండింటికీ క్లాష్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో.