జగన్ అరెస్ట్ డేట్ ఆయన చెబుతున్నారు ?
ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ అవుతారు అన్నది ఇటీవల కాలంలో బలంగా వినిపించింది.
By: Tupaki Desk | 30 May 2025 9:12 AM ISTఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ అవుతారు అన్నది ఇటీవల కాలంలో బలంగా వినిపించింది. వరసబెట్టి ఏపీకి చెందిన కూటమి అగ్రనేతలు అంతా ఢిల్లీకి క్యూ కడుతూంటే ఏదో జరుగుతోందని అంతా అనుకున్నారు. మహానాడుకు ముందే జగన్ అరెస్ట్ అని జోస్యం చెబుతూ మెయిన్ స్ట్రీం మీడియాతో పాటుగా సోషల్ మీడియా పూనాకాలే పోయింది.
కాదు మహానాడు తరువాత అని ఇపుడు గొంతు సవరిస్తోంది. మొత్తం మీద మహానాడు ముగిసింది. మూడు రోజుల పాటు అట్టహాసంగా సాగిన మహానాడుతో తెలుగుదేశం పార్టీ అంతా పూర్తిగా మునిగితేలారు. టాప్ టూ బాటమ్ అంతా మహానాడు లో గడిపారు. ఇపుడు అందరికీ తీరిక చిక్కింది. దాంతో మరోసారి జగన్ అరెస్ట్ అంశం చర్చకు వస్తోంది.
అయితే జగన్ అరెస్ట్ ఆగిపోయింది అని ఈ మధ్యన వార్తలు వచ్చాయి. ఆయన అరెస్టుకు ఎక్కడో బ్రేకులు పడ్డాయని కూడా అనుకున్నారు. కానీ అదంతా ఒట్టి మాట కచ్చితంగా జగన్ అరెస్ట్ అవుతారని ఒకాయన జోస్యం చెబుతున్నారని అంటున్నారు. అది కాస్తా ఇపుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఎవరాయన అంటే ఒకనాడు వైసీపీతో జిగినీ దోస్తుగా ఉండి సర్వం సహా తానే అయిన విజయసాయిరెడ్డి అని అంటున్నారు. ఆయన ఇటీవల తన సన్నిహితులతో ఈ మాటలు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది కేవలం ప్రచారమా లేక పుకారునా అన్నది అర్ధం కావడం లేదు.
అయితే ఆయన చెప్పారని వస్తున్న గాసిప్స్ ని చూస్తే కనుక జూన్ 10లోగా జగన్ అరెస్ట్ ఉంటుందని అంటున్నారు. అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ముగియడానికి రెండు రోజుల ముందే జగన్ అరెస్ట్ ఉంటుందని అంటున్నారు మరి ఈ విషయం ఆ నోటా నోటా వైసీపీ పెద్దలకు పాకే ఉంటుంది. కానీ ఆ వైపు నుంచి ఎలాంటి సౌండ్ అయితే లేదు.
ఇక విజయసాయిరెడ్డి ఏమి చెప్పినా దానికి విలువ లేదని ఆయన ఆ వైపు మనిషి అని జగన్ స్వయంగా మీడియా సమావేశంలో చెప్పి ఉన్న సంగతిని గుర్తు చేస్తున్నారు ఇంకో వైపు చూస్తే జగన్ కూడా అరెస్ట్ కి మానసికంగా సిద్ధం అయినట్లుగా నేను విజయవాడలోనే ఉన్నాను వారు వస్తే ఎవరు ఆపుతారు అని వ్యాఖ్యానించిన దాన్ని గుర్తు చేస్తున్నారు.
మరి జూన్ నెల అతి పెద్ద రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతుందా జూన్ లో ఏపీలో రాజకీయ భూకంపాలు వస్తాయా అంటే ఏమో ఏమి జరుగుతుందో తెలియదు కానీ పరిస్థితులు చూస్తే ఏదో జరిగేట్టు ఉందనే అంటున్నారు. చూడాలి మరి ఈ జోస్యాలు కానీ పుకార్లుగా వినిపించే ప్రచారాలు కానీ ఏవి నిజమవుతాయో చూడాల్సి ఉంది.
