Begin typing your search above and press return to search.

నెల్లూరు నేత‌ల‌పై జ‌గ‌న్ గ‌రం గ‌రం రీజ‌నేంటి..?

నెల్లూరు వైసీపీ నాయ‌కుల‌పై ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది.

By:  Garuda Media   |   17 April 2026 9:00 PM IST
నెల్లూరు నేత‌ల‌పై జ‌గ‌న్ గ‌రం గ‌రం రీజ‌నేంటి..?
X

నెల్లూరు వైసీపీ నాయ‌కుల‌పై ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ఎవ‌రికి వారు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. ఇది స‌రికాద‌ని చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న పేర్కొ న్న‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా ఇటీవ‌ల జువ్వ‌ల‌దిన్నె హార్బ‌ర్‌ను ప‌ర్య‌టించిన‌ప్పుడు.. స‌మ‌న్వ‌య లోపం స్ప‌ష్టంగా క‌నిపించింది. నాయ‌కులు ఎవ‌రికివారుగా వ్య‌వ‌హ‌రించారు. అంతేకాదు.. కొంద‌రు క‌లివిడి లేక‌పోగా.. ఇంటికే ప‌రిమితం అయ్యారు.

సుమారు 30 నుంచి 50 వేల‌ మందిని స‌మీక‌రించాల‌ని పార్టీ నెల్లూరు నాయ‌కుల‌కు దిశాని ర్దేశం చేసింది. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న అంటే.. వాస్త‌వానికి ల‌క్ష‌కు త‌గ్గ‌కూడ‌ద‌న్న నిబంధ‌న ఉంది. అయిన‌ప్ప‌టికీ.. వేర్వేరు కార ణాల‌తో దీనిని వేల‌కు ప‌రిమితం చేశారు. అయినా.. కూడా రెడ్డి నేత‌లు అనుకున్న విధంగా స్పందించ లేదని పార్టీ భావిస్తోంది. అంతేకాదు.. బ‌హిరంగ స‌భ‌కు వేదిక‌ను సిద్ధం చేయించ‌డంలోనూ నాయ‌కులు విఫ‌ల‌మ‌య్యారు. దీంతో కేవ‌లం ఓ ఆడిటోరియంలోనే మ‌త్స్య‌కారులతో జ‌గ‌న్ మీటింగ్ పెట్టాల్సివ‌చ్చిం ది.

దీని వెనుక‌స్థానికంగా ఉన్న నాయ‌కుల మ‌ధ్యే స‌ఖ్య‌త లోపం క‌నిపించిన‌ట్టుగా పార్టీ భావిస్తోంది. నెల్లూరు రూర‌ల్ ప్రాంతం నుంచి ప‌ట్టుమ‌ని 200 మంది కూడా రాలేద‌ని పార్టీ గ్ర‌హించింది. సిటీ నుంచి వ‌చ్చిన వారిలో మ‌త్స్య‌కారులు లేక‌పోవ‌డం పైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ఈ వ్య‌వ‌హారం పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. జువ్వ‌ల‌దిన్నె హార్బ‌ర్ నిర్మాణం.. వైసీపీ హ‌యాంలోనే జ‌రిగింద‌న్న విష‌యాన్ని ప్ర‌చారం చేయ‌డంలోనూ.. వెనుక‌బ‌డ్డార‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి నాయ‌కుల‌పై ఫైర‌య్యారు.

''మ‌నం చేసిన ప‌నులు కూడా మ‌నం చెప్పుకోలేక పోతున్నాం. ఇది స‌రికాదు.'' అంటూ సీనియ‌ర్ల‌కు ఫోన్లు చేసి ఆయ‌న హెచ్చ‌రించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలుపేర్కొన్నాయి. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న అంటే.. ఒక నేత‌.. అదే రోజు హైద‌రాబాద్‌కు వెళ్లిపోవ‌డంపైనా సీరియ‌స్ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇవ్వాలంటే.. ఇప్ప‌టి నుంచే అనుకూలంగా ఉండాల‌ని.. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని సూచించారు. అయితే.. చాలామంది స‌జ్జ‌ల‌ను లైట్ తీసుకుంటున్న విష‌యం తెలిసిందే.