బీజేపీ - పవన్ బంధం- చెడుతోందెవరు ..!
అయితే.. ఇప్పుడు ఈ విపత్కర కాలంలో జగన్‌ను కాపాడేవారేరీ? అనేది ప్రశ్న. ఎందుకంటే ఒకప్పుడు జగన్ కోసం కేంద్రం ఉండేది.
By: Tupaki Desk | 5 May 2025 5:36 PM ISTవైసీపీ అధినేత మౌనంగా ఉన్నారు. నోరు విప్పడమే లేదు. ఎంతసేపూ.. ఎక్స్‌లోనే తన వాయిస్ వినిపిస్తు న్నారు. గతంలో కనీసం మీడియా ముందుకు వచ్చి.. ఏవో చెప్పేవారు. కానీ, ఇప్పుడు ఆ తరహా పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా కేసులు పెరుగుతుండడం.. తన వారు కూడా జైలుకు వెళ్ల డం.. తన గురించి చెప్పేస్తుండడం వంటివి జగన్‌కు మానసికంగా ఇబ్బంది కలిగిస్తున్నాయని అంటు న్నారు పరిశీలకులు.
అయితే.. ఇప్పుడు ఈ విపత్కర కాలంలో జగన్‌ను కాపాడేవారేరీ? అనేది ప్రశ్న. ఎందుకంటే ఒకప్పుడు జగన్ కోసం కేంద్రం ఉండేది. కేంద్రంలోని పెద్దలు ఉండేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితిలేదు., కేంద్రం లోని పెద్దలు.. కూటమివైపుఉన్నారు. మరో 15 ఏళ్లపాటు వారి మధ్య బంధమూ దృఢంగానే ఉండనుంది. దీంతో దాదాపు కూటమిలోని మిత్రపక్షం.. బీజేపీ ఇప్పట్లో జగన్‌వైపు కానీ.. వైసీపీ వైపు కానీ.. చూసే పరిస్థితి లేదు. పైగా.. వారికి ఇప్పుడు పవన్ చాలా ముఖ్యం.
దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక గాలులు ప్రారంభమైనప్పుడు.. తమను ఆదుకునేందుకు ఎవరో ఒకరు ముం దుండాలనేది కమలనాథుల ప్లాన్. ఈ క్రమంలోవారికి పవన్ కల్యాణ్ కీలకంగా కనిపిస్తున్నారు. హిందీ ఉద్యమం అయినా.. పాకిస్థాన్ వ్యవహారమైనా.. తమిళనాడుతో వివాదం అయినా.. పవన్ కల్యాణ్, బీజేపీకి దక్షిణాదిలో కీలక నాయకుడిగా ఎదిగారు. సో.. ఇప్పుడు ఆయన అవసరం కన్నా.. మున్ముందు అవసరం బీజేపీకి చాలానే ఉంది. ఈ నేపథ్యంలో పవన్‌ను వదిలి ఉండే పరిస్థితి లేదు.
సో.. బీజేపీ పవన్‌తోనే కొనసాగుతుంది. 2019 ఎన్నికల తర్వాత.. పవన్‌తో బీజేపీ ప్రత్యేక బంధాన్ని పెట్టు కున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బంధం కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో బంధం బలపడిందే తప్ప. ఎక్కడా వీగిపోలేదు. ఈ నేపథ్యంలో పవన్‌కు బద్ధశత్రువైన జగన్‌ను ఇష్టమైనా .. కష్టమైనా కమలనాథులు దూరం పెట్టకతప్పడు. పైగా.. ఇప్పుడు జగన్ ఫేడ్ అవుట్(మసక బారిన) నాయకుడు. కాబట్టి.. బీజేపీ నుంచి జగన్‌కు సాయం అందే అవకాశం ఏమాత్రం లేదు. ఎలా చూసుకున్నా.. ఇప్పుడు బ్రోచేవారెవరురా..? అని జగన్ దిక్కులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
