సోమవారం మిస్ అయ్యారా? ఫర్లేదు ఈ రోజు ఫైల్ చేసేయండి
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ఆదాయపన్ను రిటర్న్ ను దాఖలు చేసేందుకు ఐటీ శాఖ ఒక రోజును అదనంగా ఇచ్చింది.
By: Tupaki Desk | 16 Sept 2025 11:03 AM ISTగడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ఆదాయపన్ను రిటర్న్ ను దాఖలు చేసేందుకు ఐటీ శాఖ ఒక రోజును అదనంగా ఇచ్చింది. నిజానికి నిన్న (సోమవారం, సెప్టెంబరు 15)టితో గడువు ముగిసింది. అయితే.. గడువు పెంచుతున్నట్లుగా సోమవారం మధ్యాహ్నం ఒక ప్రకటన వైరల్ అయ్యింది.అయితే.. అందులో నిజం లేదని.. ఐటీఆర్ దాఖలకు ఎలాంటి పొడిగింపు లేదన్న ప్రకటన వెలువడింది. అయితే.. సోమవారం రాత్రి సమయంలో ఐటీ పోర్టల్ లో ఎదురైన సాంకేతిక సమస్యలు.. వాటి పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు.
అయినప్పటికి పలువురు ఐటీఆర్ పొడిగింపునకు ఒక రోజు అదనంగా అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి వేళలో ఐటీ శాఖ నుంచి అధికారికంగా ఒక ప్రకటన విడుదలైంది. దీని సారాంశం ఐటీఆర్ దాఖలకు మంగళవారం కూడా అవకాశం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఐటీ శాఖకు సంబంధించిన పోర్టల్ లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో యూజర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు.దీంతో స్పందించిన ఐటీశాఖ రిటర్న్స్ ను దాఖలు చేసేందుకు మరో రోజు అవకాశం ఇచ్చారు.
గత ఏడాదితో పోలిస్తే సోమవారం నాటికి ఎక్కువ ఐటీ రిటర్న్ లు దాఖలైనట్లుగా చెబుతున్నారు. గత ఏడాది 7.27కోట్ల రికార్డును దాటేసి 7.3 కోట్ల రిటర్న్ లకు చేరుకున్నట్లుగా పేర్కొన్నారు. మరో రోజు అవకాశం ఇవ్వటంతో మరిన్ని ఫైళ్లు దాఖలవుతాయని భావిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటాక 2.30 గంటల వరకు ఈ ఫైలింగ్ పోర్టరల్ మొయింటనెన్స్ మోడల్ ఉంటుందని.. మార్పులు చేసుకోవటానికి ఛాన్సు ఉన్నట్లుగా ఐటీ శాఖ చెబుతోంది. మొత్తంగా గత ఏడాది రికార్డును బ్రేక్ చేయటంతో పాటు.. ఫైలింగ్ వేళ సమస్యలు ఎదురైనోళ్లకు తక్షణమే సాయం అందేలా ఏర్పాట్లు చేసిన వైనం ఆసక్తికరంగా మారాయి.
