Begin typing your search above and press return to search.

తెలంగాణలో మద్యం ప్రియులకు ఎంత కష్టం ఎంత కష్టం!!

దీంతో... దీంతో హజీపూర్ మండలంలోని లిక్కర్ డిపోకు సరఫరా నిలిచిపోయింది.

By:  Tupaki Desk   |   4 April 2024 12:46 PM GMT
తెలంగాణలో మద్యం ప్రియులకు ఎంత కష్టం ఎంత కష్టం!!
X

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వార్తలొచ్చాయి! అత్యవసరం, తప్పని పరిస్థితి అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రాకపోవడం క్షేమం అని అధికారులు సూచిస్తున్నారు. జనాలు ఈ వేసవి తాపం తాళలేక మజ్జిగ, చెరకు రసం, ఫ్రూట్ జ్యూస్ లు, పుచ్చకాయ ముక్కలను తీసుకుంటున్నారు!

మరికొంతమంది మాత్రం చల్లని బీరులను టార్గెట్ చేస్తున్నారు! అలాంటివారికి కొత్త కష్టం వచ్చి పడింది! అవును... ఎండలు మండిపొతున్న సమయంలో మందుబాబుల మనసంతా బీర్లవైపే ఉంటుందని అంటుంటారు. ఎండలో తిరిగి తిరిగిన తర్వాత ఒక చల్లని బీరు తాగితే ఆ లెక్కే వేరని చెబుతుంటారు. ఈ సమయంలో... తెలంగాణలో, ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో బీర్ల కొరత ఏర్పడిందంట. మద్యం డిపోలకు సరఫరా నిలిచిపోవడంతో ఈ సమస్య వచ్చిందని అంటున్నారు.

అసలు ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే... ప్రభుత్వ లిక్కర్ గోదాములకు సరఫరా చేసిన బీరు నిల్వలకు డబ్బులు చెల్లించకపోవడం వల్ల వచ్చిందని చెబుతున్నారట. దీంతో... దీంతో హజీపూర్ మండలంలోని లిక్కర్ డిపోకు సరఫరా నిలిచిపోయింది. దీంతో భారీ ఎత్తున బీర్ల కొరత ఏర్పడిందని చెబుతున్నారు! ఈ డిపో పరిధిలో 135 వైన్ షాప్ లు, 28 బార్లు ఉన్నాయని చెబుతున్నారు.

దీంతో.. ఎండలో ఆయసపడుతూ కౌంటర్ వద్దకు వెళ్లినవారికి బీరు లేదనే మాటకు ఆవేశం వస్తుందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు! కాగా... ఈ ఏడాది మార్చిలో 1.80 లక్షల బీర్ కేసులు అమ్ముడైనట్లు చెబుతున్నారు. అయితే... గత ఏడాది డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని అధికారులు గోదాముల్లో బీరు నిల్వలు చేయలేదని అంటున్నారు.

పైగా గత ఏడాది మే నెలలో 4 కోట్ల 23 లక్షల బీర్ల అమ్మకాలు జరిగిన విషయాన్ని అయినా దృష్టిలో పెట్టుకుని.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటూ బీరు బాబులు ఫైర్ అవుతున్నారంట. ఇక గతేడాది మే నెలలో రోజుకు సరాసరిన 23 లక్షల 50 వేల 164 బీర్లు తాగినట్లు చెబుతున్న సంగతి తెలిసిందే!