Begin typing your search above and press return to search.

మరణం తర్వాత జీవితం... సంచలన విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్త!

ఈ సృష్టిలో సమాధానాలు లేని, సమాధానాలు అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని అంటుంటారు.

By:  Tupaki Desk   |   1 Sep 2023 5:25 AM GMT
మరణం తర్వాత జీవితం... సంచలన విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్త!
X

ఈ సృష్టిలో సమాధానాలు లేని, సమాధానాలు అంతు చిక్కని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని అంటుంటారు. అయితే వాటిలో ప్రధానమైన ప్రశ్నల్లో ఒకటి... మరణం తర్వాత ఏమి జరుగుతుంది? అని! ఈ ప్రశ్నకు సమాధానం వివిద మతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. అయితే సైంట్ ఫిక్ గా ఇప్పటివరకూ సమాధానం దొరకలేదు! అయితే నా వద్ద సమాధానం ఉందని అంటున్నాడు ఒక శాత్రవేత్త!

మరణం తర్వాత ఏమి జరుగుతుంది? అని అంటే... పూర్వ జన్మ ఉంటుందని ఒక మతం చెబితే.. స్వర్గం - నరకం ఉంటాయని మరొకరు చెబుతుంటారు. అయితే దేవుడి రెండో రాకడ అనంతరం తీర్పు సమయం వరకూ ఆత్మలు మధ్యాకాశంలో ఉంటాయని మరికొందరు చెబుతుంటారు! అయితే యూఎస్‌ కి చెందిన ఓ శాస్త్రవేత్త మాత్రం... మరణం తర్వాత ఏం జరుగుతుందనే విషయం ఆధారాలతో సహా చెబుతున్నాడు!

అవును... మరణం తర్వాత ఏమి జరుగుతుంది అనే విషయంలో అత్యంత ఉత్సుహక కలిగి ఉన్నారు డాక్టర్‌ జెఫ్రీ లాంగ్‌. దీనికోసం ఏకంగా ఇప్పటివరకూ 5 వేల మరణాలపై అధ్యయనం చేశారు. ఇదే క్రమంలో... "నియర్‌ డెత్‌ ఎక్స్‌పీరియన్స్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌"ను స్థాపించాడు. ఈ ప్రయత్నాలతో, పరిశోధనల అనుభవాలతో ఓ వ్యాసాన్ని కూడా రాశాడు.

తన ప్రయోగాలతో.. తన పరిశోధనలతో రాసిన వ్యాసంలో... మరణం తర్వాత నిస్సందేహంగా జీవితం ఉంటుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆయన ఇస్తున్న వివరణ ఈ విధంగా ఉంది!

మరణించిన వ్యక్తి గుండె చప్పుడు లేకుండా ఉన్న సమయంలో కూడా వారు చూసే, వినే భావోద్వేగాలనే కలిగి ఉంటారని.. ఆ సమయంలో కూడా జీవులతో సంభాషిస్తారని అంటున్నారు జెఫ్రీ లాంగ్. ఇందులో భాగంగా సుమారు 45 శాతం మంది శరీరానికి వెలుపల ఉన్న అనుభవం గురించి స్పందించినట్లు ఆయన చెబుతున్నారు.

ఇదే సమయంలో మరణించిన వ్యక్తి శరీరం నుంచి వేరు చేయబడిన వెంటనే తమ ప్రియమైన వారిని, తమకెంతో ఇష్టమైన పెంపుడు జంతువులను పలకరిస్తారని డాక్టర్‌ లాంగ్‌ చెబుతున్నారు. మరణించిన తర్వాత జీవితం ఉంటుంది కానీ... అది ఎక్కడ, ఎలా అనేదానిపై మాత్రం శాస్త్రీయ వివరణ లేదని ఆయన అంగీకరించాడు!

ఈయన వెర్షన్ ఇలా ఉంటే... ఈయనతో అదే విషయంపై పరిశోధనలు చేస్తున్న ఇతర వైద్యులు కూడా లాంగ్ చెప్పేది అంగీకరించారు. ఆయన వెర్షన్ సరైనదేనని ఏకీభవించారు. మరణం తర్వాత జీవితం ఉంటుందని.. దానిపై మరింత పరిశోధన అవసరం అని అంటున్నారు!