Begin typing your search above and press return to search.

ఆదిత్య ఎల్ 1 కీలక ఘట్టం.. భూమికి టాటా చెప్పేసింది

తాజాగా ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్ లగ్రేంజియన్ పాయింట్ 1 దిశలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టారు

By:  Tupaki Desk   |   19 Sep 2023 4:49 AM GMT
ఆదిత్య ఎల్ 1 కీలక ఘట్టం.. భూమికి టాటా చెప్పేసింది
X

సూరీడు గుట్టుమట్లను వెలికి తీసేందుకు భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్ కు సంబంధించి మరో కీలక ఘట్టం ఆవిష్క్రతమైంది. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అయిన సంతోష సమయంలోనే.. సూర్యుడి మీద పరిశోధనలకు లక్ష్యంగా చేసిన ఆదిత్య ఎల్1 ఉప గ్రహాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగంలో మరో కీలక ఘట్టానికి చేరుకొని.. తన లక్ష్య దిశగా ప్రయాణం చేస్తోంది.

తాజాగా ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్ లగ్రేంజియన్ పాయింట్ 1 దిశలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టారు. దీనికి సంబంధించిన పోస్టును ఇస్రో సోషల్ మీడియాలో చేసింది. ట్రాన్స్ లగ్రేంజియన్ పాయింట్ లోకి సక్సెస్ ఫుల్ గా ప్రవేశ పెట్టినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం వాహక నౌక పాయిట్ వన్ దిశగా దూసుకెళుతోంది.

ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్ష్యను నాలుగుసార్లు పెంచారు. ఐదోసారి కక్ష్యను పెంచి సూర్యుడి దిశలో లంగ్రాజ్ పాయింట్ 1 వైపు వెళ్లే విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటి నుంచి 110 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని మరోసారి కక్ష్యను పెంచటం ద్వారా లగ్రాంజ్ పాయింట్ 1లోకి ప్రవేశ పెట్టనున్నారు. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించటం ఆదిత్య ఎల్1 ప్రయోగ లక్ష్యం. మన దేశం నుంచి సూర్యుడి మీద అధ్యయనం చేయటానికి ప్రయోగించిన మొదటి ఉపగ్రహంగా ఆదిత్య1ను చెప్పాలి.