Begin typing your search above and press return to search.

స్పేస్ టూరిజం ధరలు ఫిక్స్... ఫస్ట్ టూరిస్ట్ ఈయనే!

2030 నాటికి స్పేస్‌ టూరిజం ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ఇటీవల ప్రకటించాగా... సొంతంగా ఒక మాడ్యూల్‌ తయారు చేస్తున్నట్టు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   14 Sep 2023 12:17 PM GMT
స్పేస్  టూరిజం ధరలు ఫిక్స్... ఫస్ట్  టూరిస్ట్  ఈయనే!
X

ప్రస్తుతం చంద్రయాన్ - 3 సక్సెస్ ఉత్సాహంలో ఉన్న ఇస్రో.. త్వరలో స్పేస్ టూరిజం ప్రాజెక్టును పట్టాలెక్కిస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని.. అందుకయ్యే టిక్కేట్ ధర ఫిక్సయ్యిందని.. అన్నీ అనుకూలంగా జరిగితే 2030నాటికి స్పేస్ టూరిజం స్టార్ట్ అవ్వొచని తెలుస్తుంది.

అవును... అంతరిక్షంలో పర్యటించాలనుకునే భారతీయుల కల త్వరలో నెరవేరనుంది. 2030 నాటికి స్పేస్‌ టూరిజం ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ఇటీవల ప్రకటించాగా... సొంతంగా ఒక మాడ్యూల్‌ తయారు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో టిక్కెట్ ధర సుమరు 6 కోట్ల రూపాయలు ఉండొచ్చని తెలుస్తుంది.

అయితే ఈ అంతరిక్ష పర్యటన ఆర్బిటల్‌ గా ఉంటుందా లేక సబ్‌ ఆర్బిటల్‌ గా ఉంటుందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఆర్బిటల్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌.. కక్ష్య వేగంతో ప్రయాణిస్తే.. సబ్‌ ఆర్బిటల్‌ రాకెట్‌ దాని కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఇప్పటికే బ్లూ ఆరిజిన్‌ కంపెనీ సబ్‌ ఆర్బిటల్‌ రాకెట్‌ టూర్‌ ను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

2021లో బ్లూ ఆరిజిన్‌ అధినేత, అమెజాన్‌ వ్యవస్థాపకుడు.. జెఫ్‌ బెజోస్‌ మరో ముగ్గురితో కలిసి అంతరిక్షంలో పర్యటించి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇస్రో కూడా సబ్ ఆర్బిటల్ పద్దతిలోనే అంతరిక్ష టూర్ ను ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. ఈ క్రమంలో... సబ్‌ ఆర్బిటల్‌ స్పేస్‌ టూరిజం మిషన్‌ సాధ్యాసాధ్యాలపై ఇస్రో అధ్యయనం చేస్తోందని అంటున్నారు.

కాగా... ఈ అంతరిక్ష పర్యాటకం (స్పేస్ టూరిజం) చాలాకాలం క్రితమే మొదలైంది. ఆర్బిటల్‌ స్పేస్‌ టూరిజాన్ని "రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీ" గతంలోనే ప్రారంభించింది. 2001లో అమెరికన్‌ మిలియనీర్‌ డెన్నిస్‌ టిటో... రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీకి రూ.165 కోట్లు చెల్లించి స్పేస్‌ టూరిస్ట్‌ గా అంతరిక్షంలో 8 రోజులు గడిపి తిరిగి వచ్చారు. దీంతో ప్రపంచంలో మొట్టమొదటి స్పేస్‌ టూరిస్ట్‌ గా ఈయన రికార్డ్ నెలకొల్పాడు.