ఇజ్రాయెల్ చేతిలో భారత్ అభివృద్ధి చేసిన మిస్సైల్.. ఇరాన్ కు వణుకు దడ!
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి.
By: Tupaki Desk | 21 Jun 2025 7:09 PM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ సమయంలో.. జనావాసాలపైనా ఇరాన్ దాడులు చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. దీనికి భారీ పరిణామలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. ఈ సమయంలో.. భారత్ అభివృద్ధి చేసిన మిస్సైల్ ను ఇజ్రాయెల్ ప్రయోగించగా.. ఇరాన్ విలవిల్లాడినట్లు తెలుస్తోంది.
అవును... మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ సత్తా ఏమిటనేది ఇప్పటికే పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం సమయంలో తెలియగా.. తాజాగా మరోసారి ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలో భారత్ తయారీ శక్తి ఏమిటో తెలియడంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయంపై మరోసారి చర్చకు తెరలేచింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.
వివరాళ్లోకి వెళ్తే.. అవిరామంగా జరుగుతున్న యుద్ధంలో... ఇరాన్ పై భారత్ అభివృద్ధి చేసిన బరాక్ క్షిపణి వ్యవస్థను ప్రయోగించింది ఇజ్రాయెల్. దీంతో ఇరాన్ లో భారీగా నష్టం వాటిల్లిందని అంటున్నారు. ఇదే సమయంలో... ఇరాన్ పై తొలిసారిగా ఈ మిసైల్స్ ను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇదే సమయంలో.. ఇజ్రాయెల్ గగనతలంలోకి చొచ్చుకొచ్చిన డ్రోన్ లను బరాక్ క్షిపణి వ్యవస్థ కూల్చేసిందని వెల్లడించింది.
భారత దేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీ.ఆర్.డీ.ఓ) అభివృద్ధి చేసిన ఈ రక్షణ వ్యవస్థ.. ఇరాన్ డ్రోన్లను కూల్చడంలో ఎంతో ఉపయోగపడిందని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఇది టెల్ అవీవ్ అంబుల పొదిలో అద్భుతంగా మారిందని వెల్లడించింది!
కాగా... పాకిస్థాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో బరాక్ క్షిపణి వ్యవస్థను భారత్ వినియోగించింది. పాకిస్థాన్ ప్రయోగించిన వందలాది డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా ధ్వంసం చేయడంలో దీని పాత్ర కీలకమని అంటున్నారు. దీంతో.. పాక్ కి ఏమి చేయాలో తెలియక సీజ్ ఫైర్ అంటూ కాళ్ల బేరానికి వచ్చిందని చెబుతారు.
ఈ వ్యవస్థను డ్రోన్ లు, క్రూయిజ్ మిసైల్స్, ఇతర క్షిపణుల నుంచి రక్షణ కోసం 'బరాక్-8' వ్యవస్థను భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని డీ.ఆర్.డీ.ఓ.తో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ధి చేయగా... బరాక్ క్షిపణిని భారత్ - ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
