ఇరాన్ ని గట్టిగా కొట్టిన ఐడీఎఫ్.. ఏమిటీ "మిస్సైల్ సిటీ"?
ఇజ్రాయెల్ - ఇరాన్ దాడులతో పశ్చిమాసియా ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ వందలాది క్షిపణులతో దాడులు నిర్వహిస్తోంది.
By: Tupaki Desk | 15 Jun 2025 8:33 PM ISTఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ "ది రైజింగ్ లయన్" పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో.. ప్రస్తుతం పశ్చిమాసియా ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో సుమారు 79 మంది వరకు మరణించనట్లు ఇరాన్ ధ్రువీకరించింది. మరోవైపు సుమారు 300 మందికి పైగా గాయపడినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో.. ప్రతిదాడులను ఇరాన్ బలంగా చేస్తోంది.
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ దాడులతో పశ్చిమాసియా ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ వందలాది క్షిపణులతో దాడులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా.. ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ తో పాటు జెరూసలెంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 10 మంది ఇజ్రాయిలీలు మరణించారని కథనాలొస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించగా.. ఇజ్రాయెల్ వాటిని ఖండించింది.
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా వస్తున్న సమచారం ప్రకారం ఇరాన్ లోని పశ్చిమ ఖోరామాబాద్ లో గల అండర్ గ్రౌండ్ "మిస్సైల్ సిటి"పై ఇజ్రాయిల్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇరాన్ మిస్సైల్ సిటి నాశనమైంది. మార్చి 2025లో ఇరాన్ తన శక్తిని ప్రదర్శించేలా ఈ మిస్సైల్ సిటి వీడియోని షేర్ చేసింది. అండర్ గ్రౌండ్ లో ఉన్న మిస్సైళ్లను చూపించింది. ఈ ప్రచార వీడియోలో కనిపించిన మిలిటరీ జనరల్స్ ని ఇప్పటికే ఇజ్రాయిల్ హతమార్చిన సంగతి తెలిసిందే.
ఈ సమయంలో... ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ నుంచి వచ్చిన మార్గదర్శకాలతో ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు.. సర్ఫేజ్ టు సర్ఫేజ్ క్షిపణుల సాయంతో ఇరాన్ మిస్సైల్ సిటీని ఢీకొట్టిండి. పశ్చిమ ఇరాన్ లోని భూగర్భ క్షిపణి నిల్వ సౌకర్యాన్ని ఐఏఎఫ్ ఫైటర్ జెట్ లు ఢీకొట్టాయని ఇజ్రాయిల్ మిలిటరీ ధ్రువీకరించింది. దీంతో... ఇరాన్ కు అతిపెద్ద డ్యామేజ్ జరిగినట్లేనని అంటున్నారు పరిశీలకులు.
ఈ రేంజ్ లో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోన్న వేళ తాజాగా ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... కేవలం ఆత్మరక్షణ కోసమే 'టెల్ అవీవ్' పై దాడి చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఇస్లామిక్ రిపబ్లిక్ పై ఇజ్రాయెల్ సైనిక చర్యను నిలిపివేస్తే.. తాము కూడా దాడులు ఆపేస్తామని ప్రకటించింది. ఈమేరకు ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఈ విషయాన్ని వెల్లడించారు.
