Begin typing your search above and press return to search.

అమెరికాలో రాజధానిలో కాల్పులు... ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది హత్య..అసలేం జరిగింది?

అవును... వాషింగ్టన్ డీసీలోని యూదు మ్యూజియంలో జరిగిన కార్యక్రమంలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బంది హత్యకు గురయ్యారు.

By:  Tupaki Desk   |   22 May 2025 11:50 AM IST
అమెరికాలో రాజధానిలో కాల్పులు... ఇజ్రాయెల్  ఎంబసీ సిబ్బంది హత్య..అసలేం జరిగింది?
X

వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలోని ఇద్దరు సిబ్బంది కాల్చిచంపబడ్డారు. యూదు మ్యూజియంలో జరిగిన కార్యక్రమంలో దుండగులు అత్యంత సమీపంలోకి వచ్చి వీరిపై కాల్పులకు పాల్పడ్డారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెంచిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని యూదు వ్యతిరేక ఉగ్రవాద చర్యగా ఇజ్రాయెల్ అధికారులు అభివర్ణించారు.

అవును... వాషింగ్టన్ డీసీలోని యూదు మ్యూజియంలో జరిగిన కార్యక్రమంలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బంది హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను చట్టం ముందు నిలబెడతామని వెల్లడించారు. అయితే.. మృతుల వివరాలను వెల్లడించలేదు.

ఈ సమయంలో చికాగోకు చెందిన 30 ఏళ్ల వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్న సమయంలో.. "ఫ్రీ పాలస్తీనా.." అని అతడు అరిచినట్లు చెబుతున్నారు. అతడిని ఎలియాస్ రోడ్రిగ్జ్ అని గుర్తించినట్లు తెలుస్తోంది. నార్త్ వెస్ట్ డీసీలో ఉన్న ఎఫ్.బీ.ఐ. వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీసుకు కొన్ని అడుగుల దూరంలోనే ఈ కాల్పులు జరిగాయి!

ఈ ఘటనపై స్పందించిన ట్రంప్... ఈ భయంకరమైన హత్యలు, ప్రధానంగా యూదులకు వ్యతిరేకంగా జరిగే ఈ తరహా హత్యలు వెంటనే ఆగిపోవాలని.. ద్వేషం, అతివాదానికి అమెరికాలో స్థానం లేదని.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత విచారకరమని అన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్... ఈ దాడిని ద్వేషపూరితమైన చర్యగా అభివర్ణించారు. ఈ సందర్భంగా అమెరికాలోని యూదు సమాజాలకు సంఘీభావం తెలిపారు. హత్యకు గురైన ప్రియమైనవారితో తమ హృదయాలు ఉన్నాయని.. భీభత్సం, ద్వేషం తమను విచ్ఛిన్నం చేయలేవని స్పష్టం చేశారు.

కాల్పులు జరిగిన సమయంలో అమెరికన్ యూదు కమిటీ (ఏజేసీ) కాపిటల్ యూదు మ్యూజియంలో వద్ద ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిపై స్పందించిన ఏజేసీ సీఈఓ టెడ్ డ్యూచ్... వేదిక వెలుపల చ్చెప్పలేని హింసాత్మక చర్య జరగడం తమకు చాలా బాధ కలిగించిందని అన్నారు.