Begin typing your search above and press return to search.

అమెరికా గ్రీన్ సిగ్నల్ పై ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు... వాట్ నెక్స్ట్?

ఈ నేపథ్యంలో ఇరాన్ అణుస్థావరాలపై దాడికి అమెరికా సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు ఈ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.

By:  Tupaki Desk   |   20 Jun 2025 8:30 PM
అమెరికా గ్రీన్  సిగ్నల్ పై ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు... వాట్  నెక్స్ట్?
X

ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ అణుస్థావరాలపై దాడికి అమెరికా సిద్ధమవుతున్నట్లు వస్తున్న వార్తలు ఈ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఈక్రమంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... న్యూక్లియర్‌ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేమని అన్నారు.

అవును... ఇరాన్‌ లో అణుకేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందని నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ – ఇరాన్ దాడిలో అమెరికా ఎంట్రీపై పెరుగుతున్న చర్చల ప్రాధాన్యత వేల.. ఫోర్డ్‌ లోని భూగర్భ అణుకేంద్రంతో సహా ఇరాన్‌ న్యూక్లియర్‌ స్థావరాలపై దాడి చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఇజాయెల్ ప్రధాని వ్యాఖ్యల్లో సొలో కాంఫిడెన్స్ కనిపిస్తుందని అంటున్నారు.

అయితే, ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్‌ వచ్చేవరకు వేచి ఉండబోమని నెతన్యాహు స్పష్టంచేయడం గమనార్హం. ఇప్పటివరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యూఎస్ ఆదేశాల కోసం వేచి చూడలేదని చెప్పిన నెతన్యాహు... ఈ సందర్భంగా ఇరాన్‌ లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం తమకు లేదని, అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయమని అన్నారు. అదేవిధంగా... ఇరాన్‌ పై దాడిలో ట్రంప్‌ చేరాలనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా ఆయన నిర్ణయమేనని చెప్పిన నెతన్యాహు చెప్ప్పడం గమనార్హం.

ఇదే సమయంలో... తాను ఇజ్రాయెల్‌ కు ఏది మంచిదో అదే చేస్తానని, అలాగే ట్రంప్‌ కూడా అమెరికాకు మంచి జరిగే నిర్ణయాలే తీసుకుంటారని చెప్పిన నెతన్యాహు.. ఇరాన్‌ అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోందని అన్నారు.. ఇరాన్‌ పై సైనిక చర్య చేపట్టే విషయంలో ట్రంప్‌ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని శ్వేతసౌదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో... ఇరాన్‌ తో త్వరలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా, లేవా అనే అంశాన్ని బట్టి ట్రంప్‌ నిర్ణయం ఉంటుందని శ్వేతసౌదం తెలిపింది. ఏది ఏమైనా.. ఇజ్రాజెల్, ఇరాన్ వార్ లో ఇప్పుడు పెద్దన్న అమెరికా పాత్రపై కీలక చర్చ మొదలైంది.