ఇజ్రాయెల్, ఇరన్ లకు ఆయుధాలు సరఫరా... ఎక్కడెక్కడి నుంచంటే..?
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి.
By: Tupaki Desk | 20 Jun 2025 10:25 AM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇజ్రాయెల్ కు అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తుండగా, ఈ సమయంలో జర్మనీ కూడా మరో చేయి వేసింది.. ఇజ్రాయెల్ కు ఆయుధ సహాకారం అందించింది. ఈ సందర్భంగా... ఇజ్రాయెల్ ను రక్షించడానికి సైనిక పరికరాలను మోసుకెళ్లే కార్గో విమానాలు గురువారం వచ్చాయని రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, జర్మనీ నుంచి మిలటరీ కార్గో విమానాలు ఇజ్రాయెల్ కు చేరుకున్నాయి. ఇందులో ఆయుధాలతో పాటు ఇతర సామాగ్రి ఉందని అంతర్జాతీయ మీడియా వెళ్లడించింది. ఈ ఆయుధాల సహకారం విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
ఇదే సమయంలో... గత శుక్రవారం ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభమైనప్పటి నుండి అలాంటి 14 విమానాలు ఇజ్రాయెల్ లో ల్యాండ్ అయ్యాయని, అక్టోబర్ 7న జరిగిన ఊచకోత తర్వాత ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 800 కంటే ఎక్కువ విమానాలు ల్యాండ్ అయ్యాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది! రాబోయే వారాల్లో ఇటువంటి కార్గో విమానాలు ఇజ్రాయెల్ కు మరిన్ని చేరుకుంటాయని తెలిపింది!
దీనిపై ఇరాన్ స్పందించింది. ఇజ్రాయెల్ కు అమెరికా, జర్మనీ ల సహకారాన్ని తప్పుబట్టింది. ఇందులో భాగంగా... ఇది ఇరాన్ పై ఇజ్రాయెల్ దురాక్రమణలో అమెరికా బహిరంగ సహకారాన్ని సూచిస్తుందని పేర్కొంది.
ఇరాన్ కు చైనా ఆయుధాలు?:
ఇలా ఇజ్రాయెల్ కు అమెరికా, జర్మనీలు సహకరిస్తున్న విషయం తెరపైకి రాగా... ఇరాన్ కు చైనా సహకరిస్తుందనే విషయం వెలుగులోకి వచ్చింది! ఇందులో భాగంగా... ఈ సందర్భంగా యూఎస్ కు చెందిన ఫాక్స్ న్యూస్ ఓ కథనాన్ని ప్రచురించింది. చైనా బోయింగ్ 747 విమానాలు ఇరాన్ లోకి వచ్చాయని పేర్కొంది.
వాస్తవానికి ఆ విమానాల వాటి గమ్యస్థానం లక్సెంబర్గ్ అయినప్పటికీ.. యురోపియన్ గగనతలంలోకి ప్రవేశించలేదని.. బహుశా ఇరాన్ లో దిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేసింది. ఈ విమానాలను మిలటరీ సిబ్బంది, ఆయుధాలను తరలించడానికి వాడతారని తెలిపింది. ఈ నేపథ్యంలోనే.. ఇరాన్ కు చైనా సహారం అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది!
