Begin typing your search above and press return to search.

ఏనుగు వంటి ఇరాన్.. చిట్టెలుక ఇజ్రాయెల్ ముందు బలాదూర్!

ఇరాన్.. పశ్చిమాసియాలో విస్తీర్ణపరంగా పెద్ద దేశం. అణ్వస్త్ర దేశం కూడా.. మరి ఇజ్రాయెల్..? మహా అయితే ఒక్క రోజులో మొత్తం చుట్టి వచ్చేంత చిన్నది.

By:  Tupaki Desk   |   13 Jun 2025 4:00 PM IST
ఏనుగు వంటి ఇరాన్.. చిట్టెలుక ఇజ్రాయెల్ ముందు బలాదూర్!
X

ఇరాన్.. పశ్చిమాసియాలో విస్తీర్ణపరంగా పెద్ద దేశం. అణ్వస్త్ర దేశం కూడా.. మరి ఇజ్రాయెల్..? మహా అయితే ఒక్క రోజులో మొత్తం చుట్టి వచ్చేంత చిన్నది. కానీ, ఇరాన్ ను ఏడాదికి పైగా దెబ్బకొడుతోంది ఇజ్రాయెల్. తాజాగా అత్యున్నత దళమైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్ జీసీ) చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలామీనీ మట్టుబెట్టింది. ఐఆర్ జీసీ అంటే మామూలుది కాదు. ఇది కేవలం ఇరాన్ సుప్రీం లీడర్ (అలీ ఖమేనీ)కు మాత్రమే జవాబుదారీ. అంతటి పవర్ ఫుల్ దళాన్ని ఇజ్రాయెల్ ఏడాదిన్నరగా టార్గెట్ చేస్తూనే ఉంది. సిరియాలోనూ గత ఏడాది ఐఆర్ జీసీ కమాండర్లను హతమార్చింది. తాజాగా ఏకంగా ఇరాన్ లోనే ఐఆర్ జీసీ చీఫ్ నే చంపేసింది.

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ఇజ్రాయెల్ పై హమాస్ దాడి అనంతరం నుంచి కొద్దికొద్దిగా మొదలయ్యాయి. హమాస్ కు ఇరాన్ మద్దతు ఉందనేది ఇజ్రాయెల్ ఆరోపణ. గత ఏడాది ఇరు దేశాల దాదాపు ముఖాముఖి యుద్ధం వరకు వెళ్లాయి. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ 2 వేల కిలోమీటర్లకుపైనే దూరం ఉంటుంది. ఇజ్రాయెల్ మీదకు క్షిపణులతో దాడి చేసింది. వీటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా దాడికి దిగింది. ఇప్పుడు మాత్రం అణు చర్చలు విఫలం కావడమే ఆలస్యం.. ఇజ్రాయెల్ విరుచుకుపడింది.

ఐఆర్ జీసీ సుశిక్షితమైనదే కాదు.. దీనికి మూడు దళాలూ ఉంటాయి. విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే దీని విభాగాన్ని ఖుద్స్ ఫోర్స్ అంటారు.

ఇక విస్తీర్ణంలో పోలికలకు వస్తే ఇజ్రాయెల్ కంటే ఇరాన్ 70 రెట్లు పెద్దది. మ్యాప్ లో పక్కపక్కన పెట్టి చూస్తే ఎంత తేడానో తెలుస్తుంది. ఇరాన్ జనాభా కూడా 10 రెట్లు ఎక్కువే. కానీ, ఏడాదిన్నరగా ఇరాన్ మాత్రమే ఎక్కువ నష్టాన్ని చూస్తోంది. తాజాగా ఆరుగురు అణు శాస్త్రవేత్తలు ఇజ్రాయెల్ దాడిలో చనిపోయారు. గత ఏడాది మేలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇక సుప్రీం లీడర్ అలీ ఖమేనీవి కూడా పైపై హెచ్చరికలే తప్ప వాస్తవంలో చేసేది ఏమీ కనిపించడం లేదు. ఇదంతా చూస్తుంటే.. ఏనుగంత ఇరాన్.. చిట్టెలుక ఇజ్రాయెల్ ముందు తలొంచినట్లు కనిపిస్తోంది. ఇది ఇరాన్ నిర్లక్ష్యమా? బలహీనతా? అనేది చూడాలి. తాజా దాడులకు ప్రతీకారం తీర్చుకోకుంటే అది బలహీనతే అనుకోవాలి.