Begin typing your search above and press return to search.

ఇరాన్ తో యుద్ధం ఇజ్రాయెల్ కోసమే కాదు.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు!

గురువారం రాత్రి నుంచి పశ్చిమాసియా రగిలిపోతోన్న సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకూ అవిరామంగా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   16 Jun 2025 11:00 AM IST
ఇరాన్  తో యుద్ధం ఇజ్రాయెల్  కోసమే కాదు.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు!
X

గురువారం రాత్రి నుంచి పశ్చిమాసియా రగిలిపోతోన్న సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకూ అవిరామంగా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. మరోపక్క ఈ దాడులు ఆపాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై సంచలన ఆరోపణలు చేశారు.

అవును.. ప్రస్తుతం పశ్చిమాసియా రగిలిపోతోన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ లు ఏమాత్రం తగ్గకుండా ఒకరిపై ఒకరు క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో... ఇరాన్ పై తమ యుద్ధం కేవలం ఇజ్రాయెల్ కోసం కాదని.. ఇజ్రాయెల్ చేస్తోన్న ఈ యుద్ధం ప్రపంచాన్నే రక్షిస్తోందని నెతన్యాహు అంటున్నారు.

ఈ సందర్భంగా... ఇరాన్‌ ప్రపంచ దేశాలన్నింటికీ పెనుముప్పుగా మారుతోందని దుయ్యబట్టిన నెతన్యాహు... అందువల్లే దాడులు చేయడం తప్ప తమకు మరో అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ఇలా ప్రపంచానికి ఉన్న పెనుముప్పును సమూలంగా తొలగించుకునేంతవరకు తమ పోరాటం ఆగబోదని.. ఈ దాడులతో ఇజ్రాయెల్‌ యావత్‌ ప్రపంచాన్నీ రక్షిస్తోందని అన్నారు.

ఇదే సమయంలో ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... ఇరాన్‌ కు ట్రంపే నంబర్‌ వన్‌ శత్రువని.. సమస్యను పరిష్కరించగల సమర్థ నాయకుడు ఆయనని.. బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడరని.. ప్రత్యర్థికి ఎట్టిపరిస్థితుల్లోనూ లొంగిపోరని నెతన్యాహు అన్నారు.

అనంతరం.. గతంలోనూ ఆయన ఓ నకిలీ ఒప్పందాన్ని పక్కనబెట్టి.. ఖాసిమ్‌ సులేమానీని మట్టుబెట్టారని తెలిపారు. అసలు.. ఇరాన్‌ దగ్గర అణ్వాయుధం ఉండకూడదంటే వారు యురేనియంను శుద్ధి చేయకూడదని.. అందుకోసం ట్రంప్‌ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. దీంతో ట్రంప్ ను చంపాలని టెహ్రాన్‌ చూస్తోందని నెతన్యాహు ఆరోపించారు.