బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. ఇస్కాన్ కీలక నిర్ణయం
బంగ్లాలోని హిందువుల భద్రత కోసం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేపట్టనున్నట్లు ఇస్కాన్ వెల్లడించింది.
By: Tupaki Desk | 30 Nov 2024 7:47 AM GMTబంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే హిందువులపై, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసన చేస్తున్నాయి. ఇప్పటికే ఇస్కాన్ ప్రతినిధిని సైతం అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మరింత ఉద్రిక్తత నెలకొంది. ఇందులో భాగంగా ఇస్కాన్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలోని హిందువుల భద్రత కోసం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేపట్టనున్నట్లు ఇస్కాన్ వెల్లడించింది.
బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌లో ఇప్పటికే మూడు ఆలయాలు ధ్వంసం చేశారు. వందలాది మంది ప్రజలు నినాదాలు చేస్తూ ఆలయాలపై ఇటుకలు, రాళ్లు విసిరారు. దీని వల్ల శనీశ్వర ఆలయం, మరో రెండు ఆలయాల తలుపులు దెబ్బతిన్నాయి. కొత్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం ఈ దాడిని ధ్రువీకరించారు. దేవాలయాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ఆలయాలకు పెద్ద మొత్తంలో కాకుండా చాలా తక్కువే నష్టం వాటిల్లినట్లు పోలీసులు తెలిపారు.
ఛటోగ్రామ్‌లో హిందూ ఆలయాలపై దాడులు జరగడం, ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మయ్ దాస్‌పై దేశద్రోహం కేసు నమోదు కావడంతో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓడరేవు నగరంలోని హరీశ్ చంద్ర మున్సెఫ్ లేన్‌లో మధ్యాహ్నం దాడి జరిగింది. శాంతనేశ్వరి మాతృ మందిరం, శనీశ్వర ఆలయం, శాంతనేశ్వరి కలిబారి ఆలయం లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేసినట్లు తెలిసింది.
శనీశ్వర ఆలయంలోపాటు మరో రెండు ఆలయాల తలుపులు దెబ్బతిన్నాయని ఆలయ అధికారులు చెప్పిన విషయాలను మారుస్తూ మీడియా కథనాలు వెల్లడించాయి. కొత్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం దాడిని ధ్రువీకరించారు. దాడి చేసిన వారు దేవాలయాలనే టార్గెట్ చేసినట్లు చెప్పారు. బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న విపరీతమైన హింసాత్మక ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. మైనార్టీలందరినీ రక్షించే బాధ్యతను తాత్కాలిక ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేసింది.అక్కడి హిందువులను రక్షించాల్సిందే అని స్ట్రాంగ్ మెస్సేజ్ ఇచ్చింది. ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణ దాస్‌కు సంబంధించిన కేసు విషయంలోనూ న్యాయంగా, పారదర్శకంగా వ్యవహరిస్తుందని ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది.