Begin typing your search above and press return to search.

ఎవరీ ఇషితా సల్గావ్కర్? అంబానీ ఫ్యామిలీలో ఎందుకంత కీలకం?

దేశ కుబేరుడు ముకేశ్ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన బోలెడన్ని వార్తలు తరచూ వస్తుంటాయి

By:  Tupaki Desk   |   29 Dec 2023 8:30 AM GMT
ఎవరీ ఇషితా సల్గావ్కర్? అంబానీ ఫ్యామిలీలో ఎందుకంత కీలకం?
X

దేశ కుబేరుడు ముకేశ్ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన బోలెడన్ని వార్తలు తరచూ వస్తుంటాయి. చివరకు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన కథనాలకు కొదవ ఉండదు.కానీ.. అంబానీ కుటుంబంలో ముఖ్యురాలు అయినప్పటికీ.. పెద్దగా ఫోకస్ లోకి రాని వ్యక్తి ఒకరున్నారు. కామ్ గా తన పని తాను చేసుకుంటూ తాను సంపాదించే సంపాదనలో ఎక్కువ భాగం దానధర్మాలకు వెచ్చించే వ్యక్తి ఒకరున్నారు.ఆమే.. ఇషితా సల్గావ్కర్. ఎప్పుడీ పేరును వినలేదే? అని చాలామంది అనుకోవచ్చు. కానీ.. ఆమె గురించి తెలిస్తే.. అంబానీ కుటుంబంలో ఇంత ముఖ్యురాలా? అన్న మాట అదాటున వచ్చేయటం ఖాయం. కార్పొరేట్ ప్రపంచంలో సుపరిచితురాలు అయినప్పటికీ మీడియా ఫోకస్ తక్కువగా ఉండే ఆమె.. సామాన్యులకు సుపరిచితులు కారు.


ఇంతకీ ఈ ఇషితా సల్గావ్కర్ ఎవరు? అన్న విషయంలోకి వెళితే.. ముకేశ్ అంబానీ సోదరి కుమార్తె. ఆమె తల్లిదండ్రులు దీప్తి సల్గావ్కర్.. దత్తరాజ్ సల్గావ్కర్ దంపతుల గారాలపట్టి. ముకేశ్ అంబానీ మేనకోడలిగా పేరుంది. ధీరూభాయ్ అంబీనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. ఇద్దరు కుమారుల్లో ముకేశ్.. అనిల్ అంబానీలు సోదరులన్న విషయం తెలిసిందే. ఇక.. సోదరిగా దీప్తి సల్గావ్కర్ ఉన్నప్పటికీ ఆమె పెద్దగా లైమ్ లైట్ లోకి రాలేదు.

మేనమామకు ఉన్న పేరు ప్రఖ్యాతులతో తాను ఫేమస్ కావాలన్న తలంపు ఇషితా ఏ కోశాన కనిపించదు. తనదైన వ్యాపార కార్యకలాపాలు.. దానధర్మాలతో ఆమెకంటే ఒక ఇమేజ్ ఉంది. 2016లో నీరవ్ మోడీ తమ్ముడు నీషాల్ మోడీని పెళ్లాడిన ఆమె.. తర్వాత కొంతకాలానికే వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఆమె బిజినెస్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ మేనల్లుడు అతుల్య మిట్టల్ ప్రేమలో పడటం.. వీరిద్దరి పెళ్లి 2022లో జరిగింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ చేసిన ఇషితా.. సల్గావ్కర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో డెవలప్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు. తాను సంపాదించే సంపాదనలో ఎక్కువగా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుందన్న పేరు ఆమె సొంతం. విద్య.. ఆరోగ్య రంగాలకు సంబంధించి ఆమె ఎక్కువగా విరాళాలు ఇస్తూ ఉంటారు. ఆమె ఆస్తి వేల కోట్లకు ఉన్నప్పటికీ.. మీడియాలో మాత్రం ఆమె నికర ఆస్తి వివరాలు అందుబాటులో లేకపోవటం చూస్తే.. ఆమె మీద ఎంత తక్కువఫోకస్ అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.