Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ కొత్త ‘స్లోగన్’ రెడీ అయ్యిందా ?

రైతు రుణమాఫీ, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీలకు లక్ష రూపాయల సాయం లాంటి అనేక పథకాలు, హామీలు సంపూర్ణంగా అమలుకాలేదు.

By:  Tupaki Desk   |   26 Oct 2023 6:02 AM GMT
బీఆర్ఎస్ కొత్త ‘స్లోగన్’ రెడీ అయ్యిందా ?
X

రాబోయే ఎన్నికల్లో జనాలను ఆకర్షించేందుకు బీఆర్ఎస్ కొత్త స్లోగన్ ను రెడీ చేసింది. అదేమిటంటే ‘కేసీయార్ భరోసా’ వినటానికి ఇది కాంగ్రెస్ ప్రకటించిన సిక్స్ గ్యారెంటీస్ హామీలాగే ఉంది. కేసీయార్ భరోసా హామీలో మొత్తం 15 రకాల పథకాలుండబోతున్నాయి. అయితే ఈ హామీల్లో ఏ ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయన్న విషయాన్ని ప్రస్తుతం పార్టీ సీక్రెట్ గానే ఉంచింది. కేసీయార్ బహిరంగ సభల్లో వీటిని ప్రస్తావించే అవకాశముందని పార్టీవర్గాలు చెప్పాయి.

పార్టీ రిలీజ్ చేసిన మ్యానిఫెస్టో ద్వారానే 15 కార్యక్రమాల హామీలను ప్రధానంగా హైలైట్ చేయాలని కేసీయార్ డిసైడ్ అయ్యారట. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించగానే 15 కార్యక్రమాలను అమల్లోకి తేబోతున్నట్లు కేసీయార్ హామీ ఇవ్వబోతున్నారు. కేసీయార్ ప్రకటించగానే అభ్యర్దులందరు ఇదే హామీని జనాల్లో బాగా ప్రచారం చేయాలని పార్టీ ఆదేశించింది. పదేళ్ళలో పార్టీ చేసిన అభివృద్ధి, అమలుచేసిన సంక్షేమపథకాలను బాగా ప్రచారం చేయాలని కేసీయార్ ఇప్పటికే అభ్యర్ధులకు దిశా నిర్దేశం చేశారు.

కేసీయార్ భరోసా కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రకటించినా, ఒకటిరెండుచోట్ల ప్రస్తావించినా జనాల్లో నుండి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అందుకనే బహిరంగ సభల్లో ప్రకటించే బాధ్యత ను కేసీయార్ తీసుకున్నారు. ఈనెల 15వ తేదీన మ్యానిఫెస్టోను ప్రకటించినా జనాల్లో పెద్దగా చర్చ జరగటం లేదు. కాబట్టి మ్యానిఫెస్టో తో పాటు 15 రకాల హామీలను బహిరంగసభల ద్వారానే హైలైట్ చేయాలన్నది కేసీయార్ ప్లానుగా అర్ధమవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలపై జనాల్లో బాగా అసంతృప్తి ఉంది.

రైతు రుణమాఫీ, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీలకు లక్ష రూపాయల సాయం లాంటి అనేక పథకాలు, హామీలు సంపూర్ణంగా అమలుకాలేదు. దాంతో లబ్దిదారుల్లో ప్రభుత్వంపై బాగా మంటగా ఉంది. పైగా లబ్ధిదారుల ఎంపికలో కూడా ఎక్కువగా అనర్హులకే ఎంఎల్ఏలు పెద్ద పీట వేసినట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి కారణాలతోనే మంత్రులు, ఎంఎల్ఏ అభ్యర్ధులు ప్రచారానికి వస్తున్నపుడు గ్రామాల్లో జనాలు తిరగబడుతున్నారు. మరి కేసీయార్ కొత్తగా చెప్పబోయే 15 రకాల హామీలపై జనాల స్పందన ఎలాగుంటుందో చూడాల్సిందే.