Begin typing your search above and press return to search.

కేంద్రంలో బీఆర్ఎస్ కీలకమా ?

By:  Tupaki Desk   |   13 Aug 2023 11:33 AM IST
కేంద్రంలో  బీఆర్ఎస్ కీలకమా ?
X

రాబోయే ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు మంత్రి కేటీయార్ చెప్పారు. బీఆర్ఎస్ మద్దతులేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు లేవంటున్నారు. ఇదే పద్దతిలో కేసీయార్ కూడా పదేపదే ప్రకటనలు ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వంలో బీఆర్ఎస్ పాత్ర ఏ విధంగా కీలకంగా ఉండబోతోందో చెప్పమంటే మాత్రం చెప్పటం లేదు. అందుబాటులోని సమాచారం, గ్రౌండ్ రియాలిటీ ప్రకారం చూస్తే తండ్రి, కొడుకులు ఇద్దరు ఏదో నోటికొచ్చింది చెబుతున్నట్లే అనుమానంగా ఉంది.

ఎందుకంటే లాజికల్ గా వీళ్ళు చెప్పేది నిజమవుతుందని కాదు చివరకు దగ్గరగా ఉందని కూడా అనిపించటంలేదు. రెండు జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని కేటీయార్ అన్నారు. కాబట్టి కేంద్రంలో కొత్త సంకీర్ణం ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని మంత్రి జోస్యం చెప్పారు. ఆ కొత్త సంకీర్ణంలోనే బీఆర్ఎస్ చాలా కీలకపాత్ర పోషించబోతోందన్నారు. జాతీయ మీడియా నిర్వహిస్తున్న అనేక సర్వేల్లో మళ్ళీ ఎన్డీయేనే అధికారంలోకి రావటం ఖాయమని తెలుస్తోంది.

సర్వేలన్నీ ప్రతిసారి నిజమవ్వాలని గ్యారెంటీఏమీలేదు. కాకపోతే ఎన్డీయేని ఢీకొట్టేంత సీన్ ప్రస్తుత ఇండియకూటమి, ప్రతిపక్షాలకు లేదు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య పోటీచేసే సీట్లు పర్ఫెక్టుగా సెట్టయితే అప్పుడు ఎన్డీయే అభ్యర్ధులకు మంచి పోటీ ఇవ్వగలదని అనిపిస్తోంది. అప్పుడు కూడా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని ఎవరు అనుకోవటంలేదు. కాకపోతే ప్రతిపక్షాల మధ్య మంచి అవగాహన ఏర్పడితే ఎన్డీయే బలం తగ్గితే తగ్గవచ్చని అనుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్ఎస్ పాత్ర ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఇటు ఎన్డీయే అటు ఇండియా కూటమి రెండూ కేసీయార్ ను దూరం పెట్టేశాయి. రేపటి ఎన్నికల్లో తెలంగాణాలో కేసీయార్ హ్యాట్రిక్ విజయం సాధించడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లను గెలుచుకోవాలి. అప్పుడే కేసీయార్ వైపు ఎవరైనా చూస్తారు. లేకపోతే పై రెండింటిలో ఏది జరగకపోయినా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఉనికే ప్రశ్నార్ధక మైపోవటం ఖాయం. వాస్తవం ఇలాగుంటే తండ్రి, కొడుకులు మాత్రం ఏదేదో చెప్పేస్తున్నారు.