Begin typing your search above and press return to search.

అయిదేళ్ళ పాటు ఇరాన్ యుద్ధం - ప్రపంచం ఏమైపోవాలి ?

ఇక్కడ మరో విషయం ఉంది. యుద్ధం ఎవరు ప్రారంభించినా ముగింపు మాత్రం ఎవరి చేతుల్లోనూ ఉండదు, దానికి కళ్ళ ముందు రష్యా ఉక్రెయిన్ ల మధ్య నాలుగేళ్ళకు పైగా సాగుతున్న యుద్ధమే సాక్ష్యం.

By:  Satya P   |   15 March 2026 6:32 AM IST
అయిదేళ్ళ పాటు ఇరాన్ యుద్ధం - ప్రపంచం ఏమైపోవాలి ?
X

పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అని ఒక సామెత ఉంది. ఈ రోజున ప్రపంచం ఎలుక మాదిరిగా అవస్థ పడుతూ ఆందోళన చెందుతోంది. అయితే యుద్ధం సెగను రగిలించిన వారు మాత్రం చెలగాటం ఆడుతున్నారు. ఎవరి కోణంలో వారిది కరెక్ట్ అని చెబుతున్నారు. ఇజ్రాయెల్ అయితే తమ దేశం కోసం యుద్ధం అంటోంది. అమెరికా వెర్షన్ చూస్తే ఇరాన్ వల్ల అణు ముప్పు ప్రపంచానికి లేకుండా చేయడానికి అంటోంది. ఇరాన్ వాదన చూస్తే మాపైన అకారణంగా దాడి చేస్తే మేము ఊరుకోవాలా అని మండిపడుతోంది. వెరసి చూస్తే ఏవరూ తగ్గేలా లేరు. ఇక్కడ మరో విషయం ఉంది. యుద్ధం ఎవరు ప్రారంభించినా ముగింపు మాత్రం ఎవరి చేతుల్లోనూ ఉండదు, దానికి కళ్ళ ముందు రష్యా ఉక్రెయిన్ ల మధ్య నాలుగేళ్ళకు పైగా సాగుతున్న యుద్ధమే సాక్ష్యం.

రక్తం చిందిస్తాం :

చర్చలు జరుపుతామని చెబుతూనే దాడి చేశారు. అందుకే మేము కూడా యుద్ధానికి రెడీ అని ఇరాన్ అంటోంది. అంతే కాదు మా దేశాన్ని ఏ మాత్రం వదులుకోమని చెబుతోంది. భారత్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ దేశంలోని ఒక వార్తా సంస్థకు మాట్లాడుతూ అకారణంగా అక్రమంగా తమ దేశం మీద దాడి చేసిన అమెరికాతో చర్చలు అసలు ఉండవని స్పష్టం చేశారు. అంతే కాదు దీర్ఘకాలిక యుద్ధాల అనుభవం ఇరాన్ కి మాత్రమే సొంతం అని గట్టిగా చెప్పారు. మా దారి యుద్ధానికే అన్నట్లుగా సంకేతాలు ఇచ్చేశారు.

ఇరాన్ కి చేదు అనుభవాలు

అమెరికాతో గతంలో ఇరాన్ రెండు సార్లు చచలు జరిపింది అని ఆయన గుర్తు చేశారు. అయినా సరే అమెరికా ఇరాన్ మీద దాడులకే తెగబడింది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి కూడా ఒక వైపు చర్చలు జరుగుతున్నాయని అయినా అమెరికా దాడులకు దిగడం దారుణం అన్నారు. అలాంటి అమెరికాతో ఇక మీదట చర్చలు అన్నది లేనే లేదని అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ స్పష్టం చేశారు.

ఎప్పటికి ముగుస్తుంది అంటే :

ఇక ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుంది అంటే దానికి ఇరాన్ వద్ద జవాబు లేదని అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ తేల్చేశారు. ఇరాన్ లో ప్రజలు అంతా అమెరికా మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని దేశం కోసం వారు రక్తం చిందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ చెప్పారు. యుద్ధం ఆపడం అంటే దేశాన్ని వదులుకోవడమే అని ప్రజలు భావిస్తున్నారు అని ఆయన అన్నారు. ఇక తమ దేశం ఏకంగా ఎనిమిదేళ్ల పాటు ఇరాక్ తో యుద్ధం చేసింది అని ఆయన గుర్తు చేశారు. సుదీర్ఘ కాలం యుద్ధం చేసిన అనుభవం ఇరాన్ కి ఉందని ఆయన అన్నారు.

నో ఆప్షన్ అంటూ :

యుద్ధం చేయాలని ఇరాన్ కి అయితే లేదని అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ అన్నారు. కానీ అనివార్యమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మేము యుద్ధానికి వ్యతిరేకంగానే ఉంటామని అన్నారు. అంతే కాదు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరాన్ గతంలో ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసింది. అని అబ్దుల్ మాజిద్ గుర్తు చేశారు. ఈ ప్రాంతం యుద్ధాలను తట్టుకోలేదని ఆయన అన్నారు. తాజా యుద్ధంతో ప్రపంచం మొత్తం ఇబ్బందిలో ఉందని ఆయన చెప్పారు. ఈ యుద్ధం వల్ల చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అలాగే అనేక దేశాలలో ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతున్నాయని అబ్దుల్ మాజిద్ చెప్పారు. ప్రజలు చమురు దొరకక గ్యాస్ తో ఇబ్బందులు పడుతుంటే తాము కూడా బాధగానే ఉన్నామని చెప్పారు.

అంతా కలసి ఒత్తిడి తేవాలి :

అయితే ఈ యుద్ధం ఆగాలి అంటే అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ ఒక కీలక సూచన చేశారు. అది మొత్తం ప్రపంచానికే చేశారు. ప్రపంచ పెద్దలు అంతా కలసి అమెరికాను యుద్ధం ఆపమని కోరాలని ఆయన ఒక పరిష్కార మార్గం చెప్పారు. అలా అమెరికాను అంతా కలసి కట్టడి చేసి యుద్ధం ఆపితేనే ఆగుతుంది తప్ప తమ వైపు నుంచి ఆపేది అయితే లేదని తేల్చారు. ఎందుకంటే ఈ యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ కలసి తీసుకుని వచ్చాయని ఇపుడు వారే ఆపాలని ఆయన చెప్పడం విశేషం. అంతే కాదు ఇరాన్ కోసం తమ దేశం ఆత్మ గౌరవం కోసం తమ అస్తిత్వం కోసం స్వాతంత్రం కోసం యుద్ధం చేయక తప్పదని స్పష్టం చేశారు. దాని కోసం ఎందాకైనా వెళ్తామని అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ చెప్పడం విశేషం.