ప్రపంచ దౌత్య చరిత్రలో రేర్ సీన్.. ఒక పత్రం.. వేర్వేరు దేశాల్లో సంతకాలు
కార్పొరేట్ ప్రపంచంలోనూ.. ప్రపంచ దేశాల మధ్య సాధారణ పరిస్థితుల్లో జరిగే ఈ తరహా ఉదంతం.. యుద్ధం లాంటి తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
By: Garuda Media | 19 Jun 2026 12:51 PM ISTప్రపంచ దౌత్య చరిత్రలో అరుదైన ఘట్టం ఒకటి చోటు చేసుకుంది. కార్పొరేట్ ప్రపంచంలోనూ.. ప్రపంచ దేశాల మధ్య సాధారణ పరిస్థితుల్లో జరిగే ఈ తరహా ఉదంతం.. యుద్ధం లాంటి తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇరాన్ తో అమెరికా చేస్తున్నయుద్ధానికి సంబంధించి తాత్కాలిక కాల్పుల విరమణను మరో 60 రోజులకు పొడిగించే చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాల కార్యక్రమం పూర్తైంది. ఈ వార్తను ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన మీడియా సంస్థలు కవర్ చేశాయి. అయితే.. హైలెట్ చేయని ఆసక్తికర కోణం ఒకటి ఉంది. అదేమంటే.. సంతకాల కార్యక్రమంలో మూడు దేశాలకు చెందిన దేశాధినేతలు వేర్వేరు ప్రాంతాల్లో ఆన్ లైన్ లో ఉండి.. ఒకే సమయంలో సంతకాల కార్యక్రమాన్ని పూర్తి చేయటంగా దీన్ని చెప్పాలి.
ఇంతకూ ఇరాన్ - అమెరికా మధ్యనే కదా సంతకాల కార్యక్రమం జరిగిందని భావించొచ్చు. కానీ.. గ్యారెంటర్ గా పాకిస్థాన్ కూడా ఈ తాత్కాలిక కాల్పుల ఒప్పందం మీద సంతకాలు చేసింది.ఈ డీల్ కు కీలక మధ్యవర్తిగా.. గ్యారరెంటర్ గా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. పాక్ అధ్యక్షుడు పాకిస్తాన్ లోనే ఉండి ఈ పత్రాలపై డిజిటల్ సైన్ చేయటం గమనార్హం. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ నేపథ్యంలో ఒకే సమయంలో వేర్వేరు దేశాల్లోని వారంతా తాము చేసుకున్న ఒప్పందాలపై సంతకాలు చేస్తున్నది ఇటీవల కాలంలో మామూలే.
కానీ.. ఇరాన్ -అమెరికామధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం మీద సంతకాల వ్యహారం కాస్త భిన్నం. ఎందుకంటే.. యుద్ధ వాతావరణంలో అమెరికా - ఇరాన్ లాంటి బద్ధ శత్రు దేశాల అధ్యక్షులు ఒకరికొకరు కలవకుండా.. ముఖాముఖి లేకుండా ముందుగా అనుకున్న సమయానికి సంతకాలు చేయటం ఒక అరుదైన ఘట్టంగా చెప్పాలి. ఇక్కడే మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. అదేమంటే.. ఈ సంతకాల కార్యక్రమాన్ని స్విట్జర్లాండ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వహించాలి. కానీ.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ముందుగా అనుకున్న తేదీకి రెండు రోజుల ముందే కాల్పుల విరమణ డీల్ ముగించటం అరుదైన సందర్భంగా చెప్పాలి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ నుంచి..ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ టెహ్రాన్ నుంచి.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్ నుంచి ఒకే సమయంలో ఆన్ లైన్ ద్వారా డిజిటల్ సంతకాల్ని పూర్తి చేశారు. ట్రంప్ ఇంగ్లిషులో సంతకం చేస్తే..ఇరాన్ అధ్యక్షుడు పార్సీలో సంతకం చేశారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంగ్లిషులోనే సంతకం చేశారు. మరో కీలక అంశం ఏమంటే.. ఈ అంతర్జాతీయ శాంతి ఒప్పందాన్ని ఇంగ్లీష్.. పర్షియన్ భాషల్లో రూపొందించారు. పాక్ ప్రధాని ఇంగ్లిషు భాషలో సిద్ధం చేసిన అధికారిక పత్రాలపై గ్యారెంటర్ హోదాలో సంతకం చేశారు.
మొత్తంగా వేర్వేరు దేశాల్లో ఉంటూ వేర్వేరు దేశాధినేతల మధ్య జరిగిన ఈ అంతర్జాతీయ ఒప్పందం.. దౌత్య చరిత్రలో తొలిసారిగా చెబుతున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒకరి ముఖం ఒకరు చూసుకోవటానికి వీల్లేని పరిస్థితి. ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తేనే.. హార్మూజ్ నుంచి ముడిచమురు నౌకలు ముందుకు కదిలే వీలుంది. అందుకే.. షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే సంతకాల కార్యక్రమాన్ని డిజిటల్ పద్దతిలో పూర్తి చేశారు. ఏమైనా.. ఇదో అరుదైన.. ప్రత్యేక సందర్భంగా చెప్పక తప్పదు.
