అమెరికా ఎఫ్15 ఈ యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఇరాన్.. ఫైలెట్ ఎక్కడ?
ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో శుక్రవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
By: Garuda Media | 4 April 2026 9:46 AM ISTఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో శుక్రవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రోజులో రెండు ఎదురుదెబ్బలు అన్నట్లుగా అగ్రరాజ్యం ఒక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధంలో.. ఇప్పటివరకు అమెరికా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవటం ఇదే తొలిసారి. అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్15ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేయటం ఒక ఎత్తు అయితే.. ఇందులోని ఇద్దరు పైలెట్లు క్షేమంగా యుద్ధ విమానం నుంచి బయటకు దూకేశారు. అయితే.. కిందకు దూకిన ఇద్దరు ఇరాన్ భూభాగంలో దిగినప్పటికి.. ఒకరిని అమెరికా రెస్క్యూ చేసింది. మరో పైలెట్ అంశం మాత్రం మిస్టరీగా మారింది.
నైరుతి ఇరాన్ ప్రాంతంలో దాడికి దిగిన అమెరికాకు చెందిన ఎఫ్15 స్ట్రైక్ ఈగిల్ విమానం అనూహ్య రీతిలో ఇరాన్ జరిపిన దాడిలో దెబ్బ తింది. దీంతో.. ఈ జెట్ లో ఉండే ఇద్దరు పైలెట్లు పారాచూట్ ద్వారా ఇరాన్ భూభాగంలో దూకారు. వీరిలో ఒకరిని తాము రక్షించినట్లుగా అమెరికా చెబుతోంది. కాగా.. మరో పైలెట్ ఇరాన్ అధీనంలో ఉన్నట్లుగా ఇరాన్ మీడియా చెబతోంది. ఈ ఇద్దరు పైలెట్లకు సంబంధించిన సమాచారంపై ఇరు దేశాల వాదన వేర్వేరుగా ఉన్నాయి. ఇద్దరు పైలెట్లలలో ఒకరిని అమెరికా ప్రత్యేక దళాలు సక్సెస్ ఫుల్ గా రక్షించి.. ఇరాన్ భూభాగం నుంచి తరలించాయి. రెండో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లుగా ప్రాశ్చాత్య దేశాల మీడియా చెబుతోంది. మరో పైలెట్ కోసం తీవ్ర గాలింపులు జరుపుతున్నట్లుగా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు సైతం ఈ వివరాల్ని అందజేసినట్లుగా మీడియా చెబుతోంది.
ఇదిలా ఉండగా జెట్ కూల్చివేత నేపథ్యంలో ఇరాన్ భూభాగంలో దూకిన సిబ్బంది ఒకరు ఇరాన్ అదుపులో ఉన్నట్లు కొన్ని మీడియా కథనాలు చెబుతున్నా.. మరికొన్ని కథనాలు మాత్రం ఆ పైలెట్ ను పట్టుకోవాలన్న ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఆ పైలెట్ ను పట్టుకున్న వారికి భారీ బహుమతులు ఇస్తామన్న ప్రకటన చేసింది. ఈ పరిస్థితుల్లో అమెరికన్ యుద్ధ విమాన పైలెట్ ను పట్టుకోవటం ఇరు దేశాలకు కొత్త సవాలుగా మారింది. ఇప్పుడు అతగాడి క్షేమం పెద్ద చర్చగా మారింది. సదరు పైలెట్ ను ఇరాన్ అదుపులోకి తీసుకుంటే మాత్రం ఇరాన్ కు అదో పెద్ద విజయంగా మారుతుందని చెబుతున్నారు.
