Begin typing your search above and press return to search.

ఇక భీకర యుద్ధం? అర్జరాత్రి ఖతార్ గ్యాస్ జీవనాడిపై ఇరాన్ భారీ దాడి

ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇరాన్ దారుణంగా దెబ్బ తిన్నా.. వ్యూహాత్మకంగా అమెరికా మిత్రదేశాలపై దాడులకు పాల్పడటం ద్వారా.. తనకు జరిగే నష్టానికి ఏదోలా లెక్క సరి చేస్తానన్న సందేశాన్ని పంపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Garuda Media   |   19 March 2026 9:38 AM IST
ఇక భీకర యుద్ధం? అర్జరాత్రి ఖతార్ గ్యాస్ జీవనాడిపై ఇరాన్ భారీ దాడి
X

ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య సాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇరాన్ దారుణంగా దెబ్బ తిన్నా.. వ్యూహాత్మకంగా అమెరికా మిత్రదేశాలపై దాడులకు పాల్పడటం ద్వారా.. తనకు జరిగే నష్టానికి ఏదోలా లెక్క సరి చేస్తానన్న సందేశాన్ని పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటివరకు జరిగిన దానికి భిన్నంగా తమ కీలక నేతఖతాలు లారిజానీ.. నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా బుధవారం అర్థరాత్రి వేళలో ఖతార్ గ్యాస్ జీవనాడిగా చెప్పే గ్యాస్.. చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకొని భారీ దాడులు చేపట్టింది.

ఖతార్ లో అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ చేసిన క్షిపణి దాడి ఈ యుద్దాన్ని మరో దిశగా అడుగులు వేసేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా పేర్కొనే లాఫాన్ ఇండస్ట్రియల్ నగరం మీద జరిగిన దాడిలో భారీ స్థాయిలో దెబ్బ తిన్నట్లు చెబుతున్నారు. ఈ దాడులపై ఖతార్ తీవ్రంగా స్పందించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే ఇలాంటి దాడులు మరింత ఉద్రిక్తతలను పెంచుతాయని వార్నింగ్ ఇచ్చింది.

ఈ దాడి కారణంగా భారత దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లే పరిస్థితి. ఎందుకంటే.. రస్ లాఫాన్ గ్యాస్ క్షేత్రం నుంచి భారత్ కు అత్యధికంగా ఫర్టిలైజర్స్.. సీఎన్ జీ.. పీఎన్ జీ అవసరాల కోసం ఆధారపడుతుంది. భారత్ కొనుగోలు చేసే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ లో 47 శాతం ఖతార్ నుంచే వస్తోంది. అంతకు ముందు సౌదీ అరేబియా ఎనిమిది బాలిస్టిక్ మిస్సైల్స్ ను అడ్డుకున్నట్లు వెల్లడించింది.

యూఏఈలోని అత్యంత కీలకమైన బాబ్ ఆయిల్ ఫీల్డ్ పై ఇరాన్ దాడులు చేపట్టింది. దీంతో పాటు హబ్ షాన్ గ్యాస్ కాంప్లెక్స్ ను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్ షోర్ గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రంగా చెబుతారు. దీంతో యూఏఈ ప్రభుత్వం ఇక్కడి కార్యకలాపాల్ని నిలిపి వేసింది. తాజా పరిణామాలపై ట్రంప్ సీరియస్ అయ్యారు. ఖతార్ గ్యాస్ కేంద్రంపై దాడిని ఇరాన్ తెలివి తక్కువగా పేర్కొన్నారు.

తాజా పరిణామాలపై స్పందించిన ట్రంప్.. ఇరాన్ పై గతంలో ఎప్పుడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ లోని పార్స్ గ్యాస్ క్షేత్రం మొత్తాన్ని విధ్వంసం చేస్తామన్నారు. అయితే.. తాను ఆ స్థాయి హింస.. వినాశనాన్ని కోరుకోవటం లేదన్నారు. ఖతార్ ఎల్ ఎన్ ీపై మరోసారి దాడి చేస్తే మాత్రం ఏ మాత్రం సహించమని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. కొద్ది రోజులుగాచోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఈ యుద్దం రానున్న రోజుల్లో మరింత భీకరంగా సాగుతుందన్న సంకేతాల్ని ఇస్తుందని చెప్పక తప్పదు.