మొజ్తబా ప్రతిజ్ఞ... పర్యవసానం ఏంటి?
ఇరాన్ -అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు మరింత విస్తరించనున్నాయి. ఒకవైపు శాంతి ఒప్పందం కోసం.. ఇరాన్, అమెరికా ప్రయత్నాలు మరోసారి మొదలు పెట్టాయి.
By: Garuda Media | 11 July 2026 9:30 PM ISTఇరాన్ -అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు మరింత విస్తరించనున్నాయి. ఒకవైపు శాంతి ఒప్పందం కోసం.. ఇరాన్, అమెరికా ప్రయత్నాలు మరోసారి మొదలు పెట్టాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్య సంధికి ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ఇరాన్ ప్రతినిధి బృందం చర్చలకు రెడీ అయింది. అయితే.. ఈ ప్రక్రియకు ఒక రూపం వస్తున్న సమ యంలో ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి అయితొల్లా అలీ ఖమేనీని చంపిన వారిని వదిలి పెట్టేది లేదని.. వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమంలో మొజ్తబా ఖమేనీ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అలీ ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా కురిపించిన క్షిపణుల వర్షంలో ఖమేనీ సహా.. ఆయన కోడలు, భార్య, మనవలు సహా పలువురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. మధ్యలో శాంతి ఒప్పందం జరిగినా.. అది వీగిపోయింది. ఫలితంగా ఇప్పటికీ ఇరాన్ ప్రమాదపుటంచునే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మొజ్తబా ప్రకటన మరింతగా పరిస్థితిని దిగజార్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇరాన్ ఆర్థిక పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం ఇరాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్న కథనాలు వస్తున్నాయి. డాలరుతో పోల్చుకుంటే.. 50 వేల వరకు ఇరాన్‌లు చెల్లిస్తున్నారు. నిత్యవసరాల కోసం క్యూలు కడుతున్నారు. యుద్ధం కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇంకా భీతా వహ దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరోవైపు నిర్మాణాలు పుంజుకోవాల్సి ఉంది. ఇంకోవైపు నిరుద్యోగం తాండవిస్తోంది. ప్రముఖ అమెరికన్ కంపెనీలు అన్నీ వెనక్కి వచ్చేశాయి. ఈ పరిణామాల క్రమంలో ఇరాన్‌నిర్మాణమేపెద్ద సవాలుగా మారింది. ఈ సమయంలో ప్రతీకారం అంటూ చేసే వ్యాఖ్యలతో ఉద్రిక్తతలనుమరింత పెంచడమే అవుతుందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.
కనిపించని ముఖం!
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సేనలు జరిపిన దాడిలో ఖమేనీ కుటుంబం చనిపోగా.. ఆయన ముగ్గురుకుమారుల్లో ఇద్దరు విదేశాల్లో ఉండడంతో ప్రాణాలను కాపాడుకున్నారు. ఇక, అదే భవనంలో పక్కన ఉండడంతో ఖమేనీ పెద్దకుమారుడు మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వచ్చాయి. అయితే.. అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం దీనిని ఖండించాయి. ఆయన కూడా మృతి చెందారని పేర్కొన్నాయి. అయితే.. ఇరాన్ మాత్రం తీవ్ర గాయాలతో బాధపడుతూ ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నారని పేర్కొం ది. అంతేకాదు.. తదుపరి సుప్రీం లీడర్‌గా కూడా మొజ్తబాను ప్రకటించారు. కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే.. నాలుగు మాసాలకు పైగా అసలు ఎక్కడా మొజ్తబా జాడ లేకపోవడం గమనార్హం.
