ఇజ్రాయెల్ ఆయువుపట్టును ఢీకొట్టిన ఇరాన్... మొస్సాద్ కు బిగ్ షాక్!
అయిపోతున్న సంగతి తెలిసిందే. ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్.. ఎవరికి వారు పీక్స్ లో పోరాడుతున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 17 Jun 2025 10:51 PM ISTఅయిపోతున్న సంగతి తెలిసిందే. ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్.. ఎవరికి వారు పీక్స్ లో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ కు ఇరాన్ బిగ్ షాకిచ్చింది. ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడికి పాల్పడింది.
అవును... పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అణు స్థావరాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల దాడులు చేస్తుంటే.. ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే ఐదో రోజు (మంగళవారం) అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ సైనిక చర్యల్లో ఆయువుపట్టైన గూఢచర్య సంస్థ మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడికి పాల్పడింది. ఈ సందర్భంగా... మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇదే సమయంలో.. గ్లిలాట్ లోని ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ పైనా క్షిపణి ప్రయోగించినట్లు తెలిపింది.
కాగా... ఇజ్రాయెల్ సైన్యానికి మొస్సాద్ ను వెన్నెముక అని అంటారు. ఏ దేశంపై అయినా ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ ప్రకారం విరుచుకుపడటంలో మొస్సాద్ పాత్రే కీలకం అని చెబుతారు. తాజాగా ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో కూడా మొస్సాద్ దే కీలకపాత్రం. ఇరాన్ లో ఉన్న అణు స్థావరాలకు సంబంధించిన పక్కా సమాచారాన్ని ఇజ్రాయెల్ కు అందించింది.
ఇదే సమయంలో ఇరాన్ సైనిక అధికారులు, అణు శాస్త్రవేత్తల గృహాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇజ్రాయెల్ కు చేరవేసింది. దీనికంటే ప్రధానంగా... యుద్ధానికంటే ముందుగానే ఇరాన్ లో తిష్టవేసి, అక్కడ పెద్ద మొత్తంలో డ్రోన్లు, ఆయుధాలను ఏర్పాటు చేసింది! ఇంతటి మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి చేయడం కీలకంగా మారింది.
ఆ సంగతి అలా ఉంటే... ఇరాన్ అణు స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. ఆ దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను కూడా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి బ్యాంకులపై సైబర్ దాడులకు పాల్పడుతోంది. దీంతో.. వినియోగదారుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
