ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలోకి మరో దేశం.. ఇక పశ్చిమాసియాలో మహా రణమే
పశ్చియాసియా అంటేనే కక్షల ప్రాంతం... ఇజ్రాయెల్ ఒకవైపు.. మిగతా అన్ని దేశాలు ఒకవైపు.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. అలాంటిది మూడు రోజుల కిందట ఇరాన్ పైకి ఇజ్రాయెల్ దాడికి దిగింది..
By: Tupaki Desk | 15 Jun 2025 3:25 PM ISTపశ్చియాసియా అంటేనే కక్షల ప్రాంతం... ఇజ్రాయెల్ ఒకవైపు.. మిగతా అన్ని దేశాలు ఒకవైపు.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. అలాంటిది మూడు రోజుల కిందట ఇరాన్ పైకి ఇజ్రాయెల్ దాడికి దిగింది.. ఇరాన్ దీనికి ప్రతిస్పందిస్తోంది. గట్టి జవాబు ఇస్తామని కూడా చెబుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు అమెరికా మద్దతు ఉంది. అసలే ఇరాన్ అంటే అమెరికాకు కళ్ల మంట. శత్రువు కంటే ఎక్కువగా ఇరాన్ ను ట్రీట్ చేస్తుంది అమెరికా. 20 ఏళ్ల కిందటే ఇరాన్ ను రోగ్ కంట్రీ (ధూర్త దేశం) జాబితాలోకి చేర్చింది అమెరికా. ఆ దేశంపై అనేక ఆంక్షలు కూడా విధించింది. అలాంటిది అణు చర్చలు విఫలం అయ్యాక ఇరాన్ పై తీవ్రంగా మండిపడుతోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇరాన్ అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ పై తాము సరికొత్త క్షిపణిని ప్రయోగించాం అని ఇరాన్ చెబుతోంది. అయితే, ఇరాన్ అణుకేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది. కాబట్టి ఇరాన్ ప్రతీకారం ఏ విధంగా ఉంటుంది..? అనేది చూడాలి.
ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలోకి తాజాగా మరో దేశం కూడా పాల్గొంట్లున్నట్లు తేలింది. ఇజ్రాయెల్ పై యుద్ధంలో ఇరాన్ కు తాము తోడుగా నిలుస్తున్నట్లు యెమెన్ ప్రకటించింది. ఈ మేరకు యెమెన్ సైన్యం ట్వీట్ చేసింది. గత 24 గంటల్లో యెమెన్ పైకి రెండు హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది. ఇరాన్ సైన్యంతో కలిసి తాము చేసిన ఈ దాడులు విజయవంతం అయ్యాయని కూడా ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని పేర్కొంది.
వాస్తవానికి గత కొన్ని గంటలుగా హూతీలు లక్ష్యంగా ఇజ్రాయెల్ యెమెన్ మీద దాడులకు దిగుతోంది. హూతీలు అంటే ఎవరో కాదు.. యెమెన్ రెబల్స్. వీరు మొదటినుంచి హమాస్ కు మద్దతుదారులు. ఈ నేపథ్యంలో హూతీ సీనియర్ లీడర్లను టార్గెట్ చేస్తూ.. ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. యెమెన్ కూడా రంగంలోకి దిగినందున ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
