Begin typing your search above and press return to search.

ఇరాన్ పై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ల దండు... మృతుల వివరాలివే!

"ఆపరేషన్ రైజింగ్ లయన్" అంటూ ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Jun 2025 5:12 PM IST
ఇరాన్ పై ఇజ్రాయెల్ ఫైటర్  జెట్ల దండు... మృతుల వివరాలివే!
X

ఇరాన్ పై ఓ పద్దతి ప్రకారం పక్కాగా ప్లాన్ చేసి దాడులు చేస్తుంది ఇజ్రాయెల్. ఇందులో భాగంగా.. ముందుగా ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ రహస్య ఆపరేషన్ నిర్వహించి ధ్వంసం చేయగా.. అనంతరం వైమానిక దాడులతో ఐడీఎఫ్ చెలరేగిపోయింది. ఈ దాడుల్లో అండర్ గ్రౌండ్ లో ఉన్న ఇరాన్ అధికారులు మృతి చెందారు.

అవును... "ఆపరేషన్ రైజింగ్ లయన్" అంటూ ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ అంతు చూసే వరకూ ఈ ఆపరేషన్ కొనసాగుతుందంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పకనే చెప్పారు! ఈ దాడిలో తాజాగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఎయిర్ ఫోర్స్ అగ్ర నాయకత్వం చాలా వరకూ తుడిచిపెట్టుకుపోయిందని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్... ఐఆర్జీసీ ఎయిర్ కమాండ్ లోని అధికారులు భూగర్భ బంకర్ లో ఓ సమావేశం నిర్వహిస్తుండగా ఇజ్రాయెల్ దాడి చేసిందని.. దీంతో ఆ సంస్థ నాయకులు మరణించారని పేర్కొన్నారు. మరణించినవారిలో ఐఆర్జీసీ చీఫ్ సలామీ, ఆర్మీ చీఫ్ బాఘెరీ, ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలీ షంఖాని ఉన్నట్లు తెలిపారు!

ఈ క్రమంలో.. ఇరాన్ పై ఇజ్రాయెల్ నుంచి భారీఎత్తున ఫైటర్‌ జెట్ల దండు వెళ్లిందని ఐడీఎఫ్‌ ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ డెఫ్రిన్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా... వివిధ రకాలకు చెందిన 200 యుద్ధ విమానాల దండు ఇరాన్‌ పైకి వెళ్లిందని.. మొత్తం 100 టార్గెట్లపై దాడులు చేసినట్లు చెప్పారు. ఇందుకోసం 330 బాంబులు, క్షిపణులను వాడినట్లు వివరించారు.

మరోవైపు ఈ దాడులకు ప్రతీకారంగా... టెహ్రాన్ పైకి సుమారు 100 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. అయితే వాటిని కూల్చేయడంపై ఇజ్రాయెల్ దృష్టి పెట్టిందని ఐడీఎఫ్ ప్రతినిధి తెలిపారు. ఇరాన్‌ లో ప్రయోగించిన డ్రోన్లు ఇజ్రాయెల్‌ కు చేరుకోవడానికి కొన్ని గంటల సమయం పడుతుందని అన్నారు.

ఆరుగురు న్యూక్లియర్ సైటిస్టులు మృతి!:

ఇజ్రాయెల్ దాడుల్లో తమ దేశానికి చెందిన ఆరుగురు న్యూక్లియర్ సైంటిస్టులు మృతి చెందారని ఇరాన్ తెలిపింది. మృతుల్లో అహ్మద్ రెజా, అబ్ధుల్ హమీద్ మినౌచెర్, సయ్యద్ అమీర్ హోస్సెనీ ఫఖీ, మొత్లబిజదే, మహ్మద్ మొహదీ టెహ్రాంచి, ఫెరేడోన్ అబ్బాసీ ఉన్నట్లు ఇరాన్ దేశ న్యూస్ ఏజెన్సీ టాన్సిమ్ తెలిపారు.