Begin typing your search above and press return to search.

'అమెరికా ముఖంపై పిడిగుద్దు'.. సీజ్ ఫైర్ తర్వాత ఖమేనీ ఫస్ట్ రియాక్షన్!

ఈ సందర్భంగా 'ఎక్స్' వేదికగా స్పందించిన ఖమేనీ.. 'అమెరికాపైనా, మోసపూరిత జియోనిస్ట్ పాలనపైనా విజయం సాధించినందుకు ఇరాన్ కు అభినందనలు తెలియజేస్తున్నాను.

By:  Tupaki Desk   |   27 Jun 2025 12:25 AM IST
అమెరికా ముఖంపై పిడిగుద్దు.. సీజ్  ఫైర్  తర్వాత ఖమేనీ ఫస్ట్  రియాక్షన్!
X

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య మొదలైన భీకర యుద్ధం ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఈ యుద్ధంలో.. అపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటూ అమెరికా ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ జరిగిన రెండు రోజుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫస్ట్ టైమ్ స్పందించారు.

అవును... ఇజ్రాయెల్‌ తో యుద్ధం ముగిసిన తర్వాత తొలిసారిగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తొలిసారిగా స్పందించారు. ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్‌ పై ఇరాన్ విజయం సాధించినట్లు తన మొదటి ప్రసంగంలో ప్రకటించారు. ఇదే సమయంలో.. ఈ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు స్పందిస్తూ.. దీనివల్ల అమెరికా ముఖానికి గట్టి దెబ్బ తగిలిందని అన్నారు.

ఇదే సమయంలో... ఇరాన్ లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడుల గురించి ప్రస్థావించిన ఖమేనీ... ఆ దాడుల వల్ల పెద్దగా నష్జమేమీ జరగలేదని.. ఆ దాడుల వల్ల అమెరికా పెద్దగా ఏమీ సాధించలేకపోయిందని అన్నారు. ఈ సందర్భంగా... ఇరాన్ ప్రజలకు సుప్రీం లీడర్ అయుతుల్లా ఖమేనీ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా 'ఎక్స్' వేదికగా స్పందించిన ఖమేనీ.. 'అమెరికాపైనా, మోసపూరిత జియోనిస్ట్ పాలనపైనా విజయం సాధించినందుకు ఇరాన్ కు అభినందనలు తెలియజేస్తున్నాను.. అలా చేయకపోతే జియోనిస్ట్ పాలన పూర్తిగా నాశనం అవుతుందని భావించి, అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి ప్రవేశించింది.. అయితే, ఈ యుద్ధం నుండి అది ఏమీ సాధించలేదు' అని అన్నారు.

ఇదే సమయంలో... ఈ యుద్ధంలో ఇస్లామిక్ రిపబ్లిక్ విజయం సాధించిందని.. ప్రతిగా అమెరికా ముఖానికి గట్టి దెబ్బ వేసిందని.. కీలకమైన అమెరికా స్థావరాలలో ఒకటైన అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై దాడి చేసి నష్టం కలిగించిందని వెల్లడించారు.