Begin typing your search above and press return to search.

అమెరికాలో అక్రమ స్ట్రీమింగ్ వినియోగదారులకు దేశ బహిష్కరణే!

పైరసీడ్ IPTV సేవలను ఉపయోగించే వారికి ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక. అమెరికాలో అక్రమ స్ట్రీమింగ్ వినియోగదారులకు డిపోర్టేషన్ ప్రమాదంతో పాటు క్రిమినల్ కేసులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.

By:  Tupaki Desk   |   21 Jun 2025 10:37 AM IST
అమెరికాలో అక్రమ స్ట్రీమింగ్ వినియోగదారులకు దేశ బహిష్కరణే!
X

పైరసీడ్ IPTV సేవలను ఉపయోగించే వారికి ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక. అమెరికాలో అక్రమ స్ట్రీమింగ్ వినియోగదారులకు డిపోర్టేషన్ ప్రమాదంతో పాటు క్రిమినల్ కేసులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ఇటీవల ఇండియా, అమెరికా పోలీసు శాఖలు సంయుక్తంగా ఒక భారీ IPTV ముఠాను ధ్వంసం చేశాయి. ప్రపంచ ప్రఖ్యాత ఇండియన్ , అంతర్జాతీయ కంటెంట్‌ను లైసెన్స్ లేకుండా ప్రసారం చేస్తున్న ఈ నెట్‌వర్క్‌ను అధికారులు నిలిపివేశారు.

-అక్రమ IPTV నెట్‌వర్క్‌లు

ఈ ముఠా Boss IPTV, Guru IPTV, Tashan IPTV, Brampton IPTV, TopIndianIPTV, Punjabi IPTV, Vois IPTV, UltrastreamTV వంటి పేర్లతో అక్రమంగా సేవలు అందించింది. వీటిలో భారతీయ ప్రీమియం ఛానెల్‌లు అయిన Star, Sony, Zee, Sun Network, Ahaలతో పాటు Netflix, Amazon Prime Video, Hulu , అంతర్జాతీయ క్రీడా ప్రసారాలను కూడా చట్టవిరుద్ధంగా ప్రసారం చేశారు.

-తక్కువ ధర, ఎక్కువ ముప్పు

ఈ IPTV సేవలు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో వినియోగదారులు పెద్ద ఎత్తున వీటివైపు మొగ్గుచూపారు. వీటిని Android, Linux ఆధారిత సెటాప్‌లు, మొబైల్ యాప్‌లు, స్మార్ట్ టీవీల్లో పొందుపరిచారు. వీటి ప్రచారం బ్లాగులు, వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా సాగింది. అయితే ఇక్కడే అసలు ప్రమాదం ఉంది. ఈ సేవల ద్వారా వినియోగదారుల క్రెడిట్ కార్డ్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారం వంటి డేటా చోరీ చేసినట్లు సమాచారం. ఈ సమాచారాన్ని సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లు ఉపయోగించి పన్ను ఎగవేత, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉంది.

- అమెరికన్ ఛానెళ్లపై ప్రభావం

ఈ నెట్‌వర్క్ ABC, PBS, CBS, NBC వంటి అమెరికా లోకల్ ఛానెళ్లను కూడా ప్రసారం చేసింది. అంటే ఈ కేసు కేవలం భారత కంటెంట్‌కి పరిమితం కాదు. అంతర్జాతీయ కంటెంట్ కూడా దీనిలో భాగం. ఈ కారణంగా అమెరికాలో ఉన్న భారతీయులు కూడా ఈ సేవలు వినియోగిస్తే గొప్ప నేరంగా పరిగణించబడే అవకాశం ఉంది. ఇది అక్రమ వలసదారులపై మరింత దృష్టిపెట్టేలా చేసిందని అధికారులు చెబుతున్నారు. ఇది తీరని సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డిపోర్టేషన్ (దేశం నుంచి బహిష్కరణ), క్రిమినల్ ఛార్జీలు వంటి ఘోరమైన పరిణామాలకు దారితీస్తుంది.

- డాలర్లలో నష్టాలు.. కోట్లలో భారత కంటెంట్ నష్టం

ప్రముఖ OTT సంస్థల అంచనాల ప్రకారం, దక్షిణాసియా ప్రాంతం సంవత్సరానికి $200-$300 మిలియన్ల నష్టాన్ని ఈ అక్రమ IPTV సేవల వల్ల చవిచూస్తోంది. 2021లో YuppTV చేసిన ఫిర్యాదుతో ఫరీదాబాద్‌లో Boss IPTVకి చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు.

-అమెరికాలో కేసులు, కఠిన చట్టాలు

ఈ కేసు ప్రస్తుతం అమెరికాలో కూడా న్యాయపరంగా కొనసాగుతోంది. Goldstein Law Group, LLC అనే న్యాయ సంస్థ అమెరికాలో 18 U.S.C. ప్రకారం క్రిమినల్ కాపీరైట్ ఉల్లంఘన కేసు వేసింది. ఈ చట్టం ప్రకారం పైరసీ చేసిన వారిపై గట్టి చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ICE) విభాగం ఈ కేసులో చొరవ తీసుకుంటోంది.

- చట్టబద్ధమైన సేవలు మాత్రమే ఉపయోగించండి

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ కూడా పైరసీడ్ IPTVలు ఉపయోగించరాదు. లైసెన్స్ లేని ఈ సేవలు మీ వ్యక్తిగత భద్రతకే కాదు, మీ వీసా స్టేటస్‌కు, ఇమ్మిగ్రేషన్ హక్కులకు ప్రమాదం కలిగిస్తాయి. చట్టబద్ధమైన OTT ప్లాట్‌ఫామ్స్‌ను మాత్రమే ఉపయోగించడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.