Begin typing your search above and press return to search.

ఐపీఎల్ - 2024... 6+1 తెలుగు క్రికెటర్లు వీరే!

ఇక ఇప్పటికే మహ్మద్ సిరాజ్ రూపంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాడు టీం ఇండియాలో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 March 2024 3:18 PM GMT
ఐపీఎల్ - 2024... 6+1 తెలుగు క్రికెటర్లు  వీరే!
X

క్రికెట్ అభిమానులను ఎంటర్ టైన్ చేయడానికి ఐపీఎల్ - 2024 సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమయంలో ఈ సీజన్ లో సత్తా చాటేందుకు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు కూడా ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో ఈ సీజన్ వేలంలో మొత్తం 11 మంది పాల్గొనగా... అందులో ఆరుగురు క్రికెటర్లు వివిధ జట్లకు ఎంపికయ్యారు. ఇక ఇప్పటికే మహ్మద్ సిరాజ్ రూపంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాడు టీం ఇండియాలో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే.

అవును... ఈసారి ఐపీఎల్ సీజన్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఆటగాళ్లు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన వాళ్లు ముగ్గురు ఉండగా.. విశాఖకు చెందిన వారు ఇద్దరు, గుంటూరు కు చెందిన ఆటగాడు ఒకరు ఈసారి ఐపీఎల్ సీజన్ లో సందడి చేయడానికి సిద్ధపడుతున్నారు.

ఆటగాళ్లు - టీం వివరాలు:

హైదరాబాద్ కు చెందిన అరవెళ్లి అవినీశ్ రావు - చెన్నై సూపర్ కింగ్స్

హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ - ముంబై ఇండియన్స్

హైదరాబాద్ కు చెందిన మహ్మద్ రియాజ్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

విశాఖ కు చెందిన కాకి నితీశ్ కుమార్ రెడ్డి – సన్ రైజర్స్ హైదరాబాద్

విశాఖ కు చెందిన కోన శ్రీకర్ భరత్ – కోల్ కతా నైట్ రైడర్స్

గుంటూరుకు చెందిన షేక్ రషీద్ - చెన్నై సూపర్ కింగ్స్

ఈ నేపథ్యంలో తెలుగోళ్ల సత్తా చాటడానికి సిద్ధం అంటూ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఒక స్పెషల్ పోస్టర్ ని తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలుగు ఆటగాళ్లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది.