Begin typing your search above and press return to search.

ఐపీఎల్ "చంపక్".. కాపీ "చమక్".. కేసు వేసిన మీడియా సంస్థ

అయితే, చంపక్ అనేది విశేష ఆదరణ పొందిన పిల్లల పక్ష పత్రిక పేరు కూడా. 1969 నంచి ఢిల్లీ ప్రెస్ గ్రూప్ దీనిని పబ్లిష్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   2 May 2025 12:30 AM
ఐపీఎల్ చంపక్.. కాపీ చమక్.. కేసు వేసిన మీడియా సంస్థ
X

ఈ ఐపీఎల్ సీజన్ లో స్పెషల్ అట్రాక్షన్ 'చంపక్'. అంటే.. ఏ కొత్త ప్లేయరో కాదు.. ఇక మర కుక్క (రోబో డాగ్). ఆటగాళ్లతో ఆడుతూ పాడుతూ వారు చెప్పినట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది..

మ్యాచ్ అఫీషియల్స్ తో పాటు గ్రౌండ్ లోకి వస్తూ స్పెషల్ గా కనిపిస్తోంది. ఈ రోబో డాగ్ ను ఏప్రిల్ 13న స్టేడియాల్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. తొలుత దీనికి పేరు ఏమీ పెట్టలేదు. అయితే, ఏప్రిల్ 22న చంపక్ అనే పేరును ఖరారు చేశారు.

వాస్తవానికి 'చంపక్' అంటే తెలుగులో సువాసన వెదజల్లే పువ్వు అని అర్థం. అయితే, చంపక్ అనేది విశేష ఆదరణ పొందిన పిల్లల పక్ష పత్రిక పేరు కూడా. 1969 నంచి ఢిల్లీ ప్రెస్ గ్రూప్ దీనిని పబ్లిష్ చేస్తోంది. ఇంగ్లిష్, ఏడు భారతీయ భాషల్లో ప్రచురితం అవుతోంది. నీతి కథలతో పాటు చిత్ర కథలు, పజిల్స్, మెదడుకు పదును పెట్టే జోక్స్ తో పిల్లల్లో క్రియేటివిటీని పెంచే పత్రిక.

కాగా, రోబో డాగ్ కు పేరు పెట్టాల్సిందిగా ప్రేక్షకులను ఐపీఎల్ మేనేజ్ మెంట్ కోరింది. బడ్డీ, జఫ్ఫా, చంపక్, చుల్ బుల్ పేర్లను ఇవ్వగా.. చంపక్ కు 76 శాతం మంది ఓటేశారు. బడ్డీకి 10 శాతం, జఫ్ఫాకు 7 శాతం, చుల్ బుల్ కు 7శాతం ఓట్లు పడ్డాయి. దీంతో చంపక్ పేరును ఖరారు చేశారు.

నడవడం, దూకడం, కూర్చోవడం వంటి పవర్ ఫుల్ ఫీచర్లున్న చంపక్. ముందుభాగంలో కెమెరా కూడా ఉంటుంది. అందుకే ఈ సీజన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

అయితే, చంపక్ ఇప్పుడు వివాదాల్లో నిలిచింది. బీసీసీఐ తమ మేగజీన్ పేరును కాపీ కొట్టిందంటూ చంపక్ మీడియా సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో వివరణ కోరుతూ బీసీసీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. మరి ఈ పరిణామంతో బీసీసీఐ.. చంపక్ పేరు మారుస్తుందా? లేదా చంపక్ మీడియాతో రాజీకొస్తుందా?