Begin typing your search above and press return to search.

వచ్చేస్తోంది "ఐఫోన్‌ ఎయిర్‌".. స్లిమ్మెస్ట్‌ 'యాపిల్‌'

స్మార్ట్‌ ఫోన్లయందు యాపిల్‌ ఫోన్లు వేరయా? అని చెప్పుకోవాలి... ఎన్ని ఫోన్లు వాడినా.. యాపిల్‌ డివైజ్‌ల ముందు అవి దిగదుడుపే.

By:  Tupaki Desk   |   8 Sept 2025 10:46 PM IST
వచ్చేస్తోంది ఐఫోన్‌ ఎయిర్‌.. స్లిమ్మెస్ట్‌ యాపిల్‌
X

స్మార్ట్‌ ఫోన్లయందు యాపిల్‌ ఫోన్లు వేరయా? అని చెప్పుకోవాలి... ఎన్ని ఫోన్లు వాడినా.. యాపిల్‌ డివైజ్‌ల ముందు అవి దిగదుడుపే. ఈ ఫోన్‌ ఉండడమే ఓ స్టేటస్‌ సింబల్‌గా మారిపోయిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఏటా సెప్టెంబరు 9న యాపిల్‌ నిర్వహించే కొత్త సిరీస్‌ఫోన్ల లాంచింగ్‌పై విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. ఈ ఏడాది ఆ రోజు రానే వచ్చింది. మంగళవారం ‘ఆఁ డ్రాపింగ్‌’ పేరిట యాపిల్‌ పార్క్‌లో ఈవెంట్‌ నిర్వహించనుంది. యాపిల్‌ ఈవెంట్‌గా పిలుచుకునే ఈ కార్యక్రమం రాత్రి 10.30కు మొదలుకానుంది. ఈ ఏడాది ఐఫోన్‌ 17 సిరీస్‌ను తీసుకొస్తోంది.

నాలుగు ఫోన్లే.. ఒక సిరీస్‌పోయింది..

యాపిల్‌ ప్రతి సిరీస్‌లో నాలుగు వేరియంట్లు తీసుకొస్తుంది. గత ఏడాది విషయమే తీసుకుంటే.. ఐఫోన్‌16, 16 ప్లస్‌, 16ప్రో, ప్రోమ్యాక్స్‌లను విడుదల చేసింది. ఈ ఏడాది మాత్రం ప్లస్‌ సిరీస్‌ను వదిలేసింది. ఆ స్థానంలో ఐఫోన్‌ 17ఎయిర్‌ను తీసుకొస్తోంది. క్రేజియెస్ట్‌ ఫోన్‌గా ఇప్పటికే దీనికి పేరొచ్చింది. కారణం.. స్పెషాలిటీలే.

కాంపాక్ట్‌ కాదు.. స్లిమ్మెస్ట్‌

యాపిల్‌ అంటే కాంపాక్ట్‌ ఫోన్లు. దీని అర‍్ధం.. ఒకే తరహా అని. కానీ, ఈ సారి స్లిమ్‌ ఫోన్‌ను తెస్తోంది. అదే పైన చెప్పుకొన్న ఐఫోన్‌ ఎయిర్‌. దీని మందం 5.5 మిల్లీమీటర్లు. ఇప్పటివరకు యాపిల్‌ విడుదల చేసిన అత్యంత స్లిమ్మెస్ట్‌ ఫోన్‌గా దీనిని చెబుతున్నారు. బ్యాటరీ 2,800 ఎంఏహెచ్‌ లేదా 3100 ఎంఏహెచ్‌ ఉండొచ్చని అంటున్నారు. కెమెరా 48 ఎంపీ.

-ఇక కొత్త ఐఫోన్‌ 17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్‌ మోడళ్లు ఏ19ప్రో చిప్‌సెట్‌తో వస్తాయి. నిరుడు విడుదల చేసిన ఐఫోన్‌ 16 డిస్‌ప్లే 6.1 అంగుళాలు. కానీ, ఐఫోన్‌ 17లో 6.3 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. తొలిసారిగా తెస్తున్న 120 హెర్ట్ట్జ్జ్‌ రిఫ్రెష్‌ రేటు అత్యంత కీలకమైనది. యాపిల్‌ ఫోన్లలో తక్కువ రిఫ్రెష్‌ రేటు ఉండడంపై చాలా విమర్శలున్నాయి. వాటికి ఇప్పుడు చెక్‌ పడనుంది.

ఇవి కొత్త.. ఇవి అదనం...

-ప్రీమియం మోడల్స్‌ అయిన ప్రో సిరీస్‌ల డిజైన్లు మారనున్నారు. మొత్తం అన్ని సిరీస్‌లలో కెమెరా, బ్యాటరీల పనితీరు మెరుగుపరిచినట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగానే యాపిల్‌ ఈ ఏడాది కొత్త వాచ్‌లు (అల్ట్రా3, సిరీస్‌ 11, ఎస్‌ఈ), ఎయిర్‌పాడ్స్‌ తేనుంది. వీటిలో ఎయిర్‌పాడ్స్‌ 3ప్రో కొత్తవి.