Begin typing your search above and press return to search.

"మా మిగిలిపోయిన కూరను వేడిచేసి వడ్డిస్తున్నారు".. యాపిల్‌- డ్యూయోపై శామ్‌సంగ్, మోటోరోలా పంచ్‌లు!

అయితే ఫోల్డబుల్ ఐఫోన్ ఆవిష్కరణకు ముందే శామ్‌సంగ్ ఒక అడుగు ముందుకేసి.. ``మమ్మల్ని వేచి చూసేలా చేస్తున్నారా?

By:  Srikanth Kontham   |   10 Sept 2026 1:20 PM IST
మా మిగిలిపోయిన కూరను వేడిచేసి వడ్డిస్తున్నారు.. యాపిల్‌- డ్యూయోపై శామ్‌సంగ్, మోటోరోలా పంచ్‌లు!
X

యాపిల్ సంస్థ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యూయోను ఆవిష్కరించిన కొద్దిసేపటికే ప్రత్యర్థి బ్రాండ్లు సోషల్ మీడియా వేదికగా యాపిల్‌పై ట్రోలింగ్‌తో విరుచుకుపడ్డాయి. 2019లోనే గెలాక్సీ ఫోల్డ్‌తో ఫోల్డబుల్ విభాగాన్ని ప్రారంభించిన శామ్‌సంగ్.. తమను అనుకరిస్తూ లేట్‌గా ఈ కేటగిరీలోకి వచ్చారంటూ యాపిల్‌ను దారుణంగా ఆటపట్టించింది. ఐఫోన్ 18 ప్రో డిజైన్‌పై స్పందిస్తూ ``అంతా పాతలాగే ఉందే.. ఇది సీమ్స్ గేమ్ సీక్వెలా?`` అంటూ శామ్‌సంగ్ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.

అయితే ఫోల్డబుల్ ఐఫోన్ ఆవిష్కరణకు ముందే శామ్‌సంగ్ ఒక అడుగు ముందుకేసి.. ``మమ్మల్ని వేచి చూసేలా చేస్తున్నారా? అయితే ఓకే.. మేమిక్కడ గేలాక్సీ ఫోన్‌ను 3 మడతలు పెడుతూ ఉంటాం`` అంటూ సెటైర్ వేసింది. ఇక ఐఫోన్ డ్యూయో లాంచ్ అయిన తర్వాత మరింత ఘాటుగా స్పందిస్తూ.. ``మా మిగిలిపోయిన పదార్థాలను వేడి చేసి వడ్డించడం.. అయిపోయాక మాకు చెప్పండి`` అంటూ X లో నేరుగా కౌంటర్ ఇచ్చింది.

ఈ వివాదంలో ప్రముఖ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ `డుయోలింగో` కూడా చేరింది. తమ యాప్ మాస్కాట్ పేరు `డ్యూయో` కావడంతో..వారు నా పేరు మీద ఫోన్ పెట్టి దానిని ఇలా వంగేలా చేశారు! అని పోస్ట్ చేయగా దానికి శామ్‌సంగ్ ``నా సానుభూతి డుయోలింగో.. వారు మమ్మల్ని కూడా కాపీ కొట్టారు`` అని రిప్లై ఇచ్చింది. మరోవైపు మోటోరోలా కూడా తమ `రాజర్` హెరిటేజ్‌ను గుర్తుచేస్తూ, ``కొందరు ఇప్పుడే ఫోల్డబుల్స్‌ను కనిపెడుతున్నారు.. మేము ఇప్పటికే దాన్ని మరింత మెరుగుపరిచాం.. మా నెక్స్ట్ మూవ్ కోసం వేచి చూడండి`` అని వీడియో రిలీజ్ చేసింది.

ఈ సోషల్ మీడియా ట్రోల్స్ పక్కన పెడితే.. యాపిల్ వర్గాల్లో మాత్రం `ఐఫోన్ డ్యూయో` విప్లవాత్మక మార్పుగా నిలిచింది. భారతదేశంలో ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ధర రూ.2,99,900 నుంచి ప్రారంభమవుతోంది. స్టార్ వైట్, నైట్ స్కై రంగుల్లో... 256GB, 512GB, 1TB, 2TB స్టోరేజ్ వేరియంట్లలో ఇది లభించనుంది. భారత్‌లో అక్టోబర్ 16 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 23 నుంచి వినియోగదారులకు విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి పాత వెర్ష‌న్ల ధ‌ర‌ల‌ను భారీగా పెంచిన విష‌యం తెలిసిందే. మార్కెట్లో సెల్ ఫోన్ కంపెనీల మ‌ధ్య పోటీ ఎలా ఉందో ఇప్పుడు ఆన్ లైన్ ప‌రాచికాల ద్వారా అంద‌రికీ మ‌రోసారి అవ‌గాహ‌న వ‌చ్చింది.

స్మార్ట్ వాచ్ సిగ్మెంట్ లో పోటీ లేదా?

గ్లోబల్ స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో ఆపిల్ వాచ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నా.. ప్రధానంగా శామ్‌సంగ్ , గార్మిన్ , పిక్సెల్ వాచ్‌లతో గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు దానికి గట్టి పోటీని ఇస్తున్నాయి. శామ్‌సంగ్ తన `గెలాక్సీ వాచ్` సిరీస్ ద్వారా ఆండ్రాయిడ్ వినియోగదారులను ఆకట్టుకుంటూ అత్యాధునిక హెల్త్ ట్రాకింగ్ -స్లీప్ అనాలిసిస్ ఫీచర్లతో ఆపిల్‌కు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. మరోవైపు ఫిట్‌నెస్ అథ్లెట్లు, స్పోర్ట్స్ ప్రియులను లక్ష్యంగా చేసుకుని గార్మిన్ బ్యాటరీ లైఫ్ క‌చ్ఛితమైన జీపీఎస్ నెట్‌వర్క్‌తో ప్రీమియం విభాగంలో ఆపిల్ వాచ్ ఆల్ట్రాకు సవాలు విసురుతోంది. వీటితో పాటు షియోమి, నాయిస్, బోట్ వంటి బ్రాండ్లు బడ్జెట్ మార్కెట్‌లో భారీ విక్రయాలతో వాల్యూమ్ పరంగా ఆపిల్‌పై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి.