Begin typing your search above and press return to search.

దేశంలో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య పెరుగుందని తెలుసా?

ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం పెరుగుతోంది. గతంలో కన్నా ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది

By:  Tupaki Desk   |   11 March 2024 2:57 PM GMT
దేశంలో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య పెరుగుందని తెలుసా?
X

ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం పెరుగుతోంది. గతంలో కన్నా ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం 5జీ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లు వాడే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. దీంతో ఇంటర్నెట్ సేవలు కూడా విరివిగా మారుతున్నాయి. తెల్లవారింది మొదలు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. చదువుకున్న వారే కాకుండా చదువుకోని వారు కూడా ఇంటర్నెట్ సేవలకు ఆకర్షితులవుతున్నారు.

పూర్వం రోజుల్లో ఫోన్లు లేనప్పుడు మాటలతోనే కాలక్షేపం చేసేవారు. అందరు ఒకే చోట కూర్చుని కబుర్లు చెప్పుకునే వారు. రాజకీయాలు, నాటకాలు, డ్రామాలు ఇలా పలు రకాల ఆటలు ఆడేవారు. దీంతో వారికి కాలక్షేపం అయ్యేది. ప్రస్తుతం ఎవరి చేతిలో ఫోన్ తో వారే టైంపాస్ చేస్తున్నారు. ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. వారి సంఖ్య కోట్లలోనే పెరుగుతోంది. ఈనేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల వాడకం ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో అప్పుడే పుట్టిన బిడ్డలకు కూడా ఫోన్లు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.

దేశంలో ప్రస్తుతం 821 మిలియన్లకు పైగా ప్రజలు ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది వినియోగదారుల సంఖ్య పెరగడంతో సేవలు కూడా పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 442 మిలియన్లు, అర్బన్ ప్రాంతాల్లో 379 మిలియన్ల మంది ఇంటర్నెట్ సేవలు వాడుతున్నారు. ఇలా ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నానాటికి ఎక్కువవుతోంది.

గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అంతగా చైతన్యం ఉండేది కాదు. కానీ ఇప్పుడు గ్రామీణులే అన్నింట్లో ముందుంటున్నారు. స్మార్ట్ ఫోన్లు వాడుతూ అరచేతిలో ప్రపంచం చూస్తున్నారు. సీరియళ్లు, సినిమాలు, ప్రోగ్రామ్ లు చూస్తూ సరదాగా గడుపుతున్నారు. చదువు రాని వారికి కూడా సెల్ ఆపరేట్ చేయడం సులువుగా మారుతోంది. దీంతోనే ఫోన్ల వినియోగం రెట్టింపవుతోంది.

దేశంలో సగటున 82 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. కంపెనీలు కూడా ఇంటర్నెట్ సేవలను పెంచుతున్నాయి. పెరుగుతున్న వినియోగదారుల కోసం పలు సేవలు అందిస్తున్నాయి. పలు ఆఫర్లు ఇస్తున్నాయి. దీంతో ఇంటర్నెట్ వాడకం రోజురోజుకు ఇనుమడిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలో నానాటికి ఇంటర్నెట్ సేవలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అది వాడే వారి సంఖ్య కూడా అంతే వేగంగా విస్తరిస్తోంది.