కమలం నేతలు.. కొన్ని వివాదాలు..!
అయితే.. కాలం మారింది. ప్రజల నాడినిపట్టుకునే క్రమంలో ఇతర నాయకులను, ఇతర పార్టీలకు చెంది న వారికి కూడా కమల నాథులు రెడ్ కార్పెట్ పరిచారు.
By: Tupaki Desk | 23 April 2025 8:00 PM ISTరాష్ట్రంలో కమల నాధుల మధ్య వివాదాలు రచ్చ రేపుతున్నాయి. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న వారితో కొత్తగా వచ్చిన నాయకులు కలివిడి లేకుండా ముందుకు సాగుతున్నతీరు.. పార్టీలో ఐక్యత బదులు.. వివా దాలకు కేంద్రంగా మారుతోంది. ముందు నుంచి కూడా.. పార్టీని నడిపించిన వారిలో ఆర్ ఎస్ ఎస్ భావ జాలం ఉన్న వారు ఎక్కువగా ఉన్నారు. గతంలో రాజకీయాలను.. వారే శాసించారు. అంతేకాదు.. వారు చెప్పినట్టే.. బీజేపీ కూడా నడిచేది.
అయితే.. కాలం మారింది. ప్రజల నాడినిపట్టుకునే క్రమంలో ఇతర నాయకులను, ఇతర పార్టీలకు చెంది న వారికి కూడా కమల నాథులు రెడ్ కార్పెట్ పరిచారు. ఈ క్రమంలోనే వారికి ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే స్థానా లు కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా.. కొందరు ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉన్న నాయకులు వ్యతిరే కించారు. కానీ, పార్టీ జోక్యంతో కొంత సర్దుకున్నారు. అయితే.. ఎంపీలుగా గెలిచిన వారు.. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారితో ఇతర నాయకులకు సర్దుబాటు రాజకీయాలు సాగడం లేదు.
ఇదే వివాదంగా మారింది. ఉదాహరణకు రాజమండ్రి ఎంపీగా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరికి.. స్థానిక బీజేపీ నేతలకు పొసగడం లేదన్నది వాస్తవం. దీంతో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది పార్టీ కార్యక్రమాల విషయంలోనూ కలివిడి లేని వ్యవహారంగా మారింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు.. ఈ జిల్లాలోనే ఉన్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌కు మధ్య ఏమాత్రం కుదరడం లేదు. పైగా.. ఎవరికి వారుగా ఉంటున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న సుజనాచౌదరికి.. ఇదే జిల్లాకు చెందిన కొందరు కమల నాథులకు మధ్య వివాదాలు జరుగుతున్నాయి. అంతేకాదు.. ఒకరు పాల్గొన్న కార్యక్రమానికి మరొకరు వెళ్లకపోవడం కూడా కనిపిస్తోంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు బీజేపీపై పట్టుంది. అయితే.. ఆయనకు కొత్త నాయకులతో పొసగడం లేదన్నది కనిపిస్తోంది. దీంతో కమల నాథుల మధ్య ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి ఏర్పడింది. దీనిని సరిదిద్దే వారు కూడా కనిపించకపోవడం గమనార్హం.
