Begin typing your search above and press return to search.

ఇన్ స్టా రీల్స్ ఎఫెక్ట్... తిక్క వ్యవహారాల వీడియోలు వైరల్!

ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది రకరకాల విన్యాశాలు చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 March 2024 12:30 AM GMT
ఇన్  స్టా రీల్స్  ఎఫెక్ట్... తిక్క వ్యవహారాల వీడియోలు వైరల్!
X

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా ఉన్నపలంగా పాపులర్ అయిపోవాలని.. ఒక్క వీడియోతో సెలబ్రెటీ అయిపోవాలని చాలా మంది తెగ తాపత్రయ పడుతుంటారు. ఈ తాపత్రయంలో వారు చేయని ప్రయత్నాలు ఉండవు! సమయం, సందర్భం, స్థలం వంటి వాటితో ఏమాత్రం సంబంధం లేకుండా చేతిలో ఉన్న సెల్ ఫోన్ ని ఆన్ చేస్తుంటారు.. అందులోని కెమెరా బట్ నొక్కి స్టార్ట్ చేసేస్తుంటారు.

ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది రకరకాల విన్యాశాలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల హోలీ సందర్భంగా మెట్రో ట్రైన్ లో ఇద్దరు అమ్మాయిలు చేసిన చిత్రాలు అన్నీ ఇన్నీ కాదన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఒక యువకుడు స్కూటీ నడుపుతుండగా... వెనుక ఎదురెదురుగా కుర్చున్న ఇద్దరు అమ్మాలు చేసిన విచిత్ర విన్యాశాలూ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి!

ఇదే క్రమంలో... అదే రోజు ఓ యువకుడు బైక్ నడుపుతుండగా... వెనకాల ఉన్న అమ్మాయి స్టంట్ చేయబోయి బోర్లాపడిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఒక యువతి ఎయిర్ పోర్ట్ లోని లగేజ్ ట్రాలీపై పడుకుని వీడియోలు తీసుకుంది. దీంతో... సదరు యువతిపై ఎయిర్ పోర్ట్ అధికారులు సీరియస్ అయ్యారని తెలుస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో చిల్లర పనులు మానుకోవాలని నెటిజన్లు తలంటారు!

ఇదే సమయంలో తాజాగా ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఒకే ద్విచక్ర వాహనంపై వెళ్తూ అసభ్యకర చర్యకు పాల్పడుతున్న వీడియో వైరల్ అయ్యింది. యూపీలోని నొయిడాలో ఈ టీం హోలీని జరుపుకున్న అనంతరం ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా బైక్ పై వెళ్తున్న యువకులు అనుచితంగా ప్రచర్తించడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

దీంతో... ఈ వీడియో వైరల్ అయ్యింది! ఇలా ఈ వీడియో వైరల్ కావడంతో నొయిడా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ వీడియోలో బైక్ పై ప్రవర్తిస్తున్న వారికి రూ.24,500 జరిమానా విధించారు. ఇలా పోలీసులు ఫైన్స్ వేస్తున్నా.. నేటిజన్లు తలంటుతున్నా.. ప్రజలంతా గడ్డిపెడుతున్నట్లుగా కామెంట్లు పెడుతున్నా.. బహిరంగ ప్రదేశాల్లో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన ప్రవర్తనను మాత్రం ఈ బ్యాచ్ మానడం లేదు.