Begin typing your search above and press return to search.

ఏడాదిలో రూ.లక్ష కండోమ్స్.. వీడు మగడ్రా బుజ్జి!

ఒక్క ఏడాదిలో లక్ష రూపాయల విలువైన కండోమ్స్ కొనుగోలు చేసిన వ్యక్తిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   24 Dec 2025 12:00 AM IST
ఏడాదిలో రూ.లక్ష కండోమ్స్.. వీడు మగడ్రా బుజ్జి!
X

ఒక్క ఏడాదిలో లక్ష రూపాయల విలువైన కండోమ్స్ కొనుగోలు చేసిన వ్యక్తిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చెన్నైకి చెందిన ఆ వ్యక్తి కండోమ్స్ కోసమే రూ.లక్ష ఖర్చు చేయడం చూస్తే.. గురుడు ఎంత రసిక పురుషుడో అర్థం అవుతోందని కొందరు.. వీడు మగడ్రా బుజ్జి అంటూ మరకొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా కండోమ్స్ ధరలు.. సదరు చెన్నై వాసి కొనుగోలు చేసిన మొత్తానికి వచ్చిన కండోమ్స్ ఎన్ని ఉంటాయనే లెక్కలతో మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఇన్‌స్టామార్ట్‌ ఈ ఏడాది జరిగిన వ్యాపారంపై ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆ నివేదికలో కండోమ్స్ వాడకంపై చూపిన లెక్కలు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాయి.

గత ఏడాది ఇన్‌స్టామార్ట్‌కు వచ్చిన ఆర్డర్లలో ప్రతి 127 ఆర్డర్లకు ఒక ఆర్డర్ కండోమ్ ఉంటోందని ఇన్‌స్టామార్ట్‌ వెల్లడించింది. అంతేకాకుండా సెప్టెంబరు నెలలో సాధారణ అమ్మకాలు కంటే 24 శాతం అధికంగా కండోమ్స్ విక్రయాలు జరిగినట్లు ఇన్‌స్టామార్ట్‌ వివరించింది. ఈ క్రమంలోనే చెన్నైకి చెందిన ఓ వ్యక్తం ఏకంగా లక్ష రూపాయల విలువ చేసే కండోమ్స్ కొనుగోలు చేసినట్లు తెలియజేసింది. ఒక ఏడాదిలో 228 ఆర్డర్ల ద్వారా అతడు కేవలం కండోమ్స్ కొనుగోలు చేసినట్లు ఇన్‌స్టామార్ట్‌ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఇన్‌స్టామార్ట్‌ నివేదికలో కండోమ్స్ కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలు ఇవ్వకపోయినా, ఆ నివేదికలో సదరు కస్టమర్ టాపిక్ ఎక్కువగా ఆకర్షణీయంగా ఉందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

ఇక హైదరాబాద్ కు చెదిన ఓ వ్యక్తి మూడు వేర్వేరు ఆర్డర్లతో మూడు ఐఫోన్-17 కొనుగోలు చేసినట్లు ఇన్‌స్టామార్ట్‌ తెలిపింది. ఈ ఆర్డర్ల విలువ సుమారు రూ.4.30 లక్షలు కావడం విశేషం. ఈ ఏడాదిలో ఇలాంటి అసాధారణ ఆర్డర్ల విశేషాలతో హౌ ఇండియా ఇన్‌స్టామార్టెడ్ 2025 అనే టైటిల్ తో ఇన్‌స్టామార్ట్‌ విడుదల చేసిన నివేదిక ట్రెండింగ్ గా మారింది. ప్రస్తుతం అందరూ ఆన్ లైన్, ఈ-కామర్స్ ప్లాట్ ఫాంలను ఎక్కువగా వినియోగించడం వల్ల గత ఏడాది లావాదేవీలు భారీగా పెరిగినట్లు ఆ నివేదికలో స్పష్టమైంది. కరివేపాకు నుంచి గులాబీల వరకు.. టెక్ ఉత్పత్తుల నుంచి పెట్ దాణాల వరకు అంతా, అన్నీ ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నట్లు ఇన్‌స్టామార్ట్‌ వెల్లడించింది.

ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14న భారతీయ కస్టమర్లు ప్రతి నిమిషానికి 666 గులాబీ పువ్వుల కోసం ఆర్డర్ చేసినట్లు ఇన్‌స్టామార్ట్‌ తెలిపింది. హైదరబాద్ నగరానికి చెందిన ఓ కస్టమర్ ఏకంగా రూ.31,240 వెచచించి గులాబీలు కొనుగోలు చేశాడని పేర్కొంది. అదేవిధంగా కేరళలోని కొచ్చికి చెందిన కస్టమర్ ఒకరు కరవివేపాకు కొనుగోలు కోసం తమ ప్లాట్ ఫాం వినియోగించుకున్నట్లు వెల్లడించింది. ఇక ఎవ్రీ డే హీరోస్ ఆఫ్ ది షాపింగ్ విభాగంలో ఎక్కువ మంది కరివేపాకు, పెరుగు, గుల్డు, పాలు, అరటి పండ్లకు ఆర్డర్లు ఇచ్చారని తెలిపింది. ఇదే సమయంలో బెంగళూరు నగరానికి చెందిన కస్టమర్లు డెలవరీ బాయ్స్ కు ఎక్కువ మొత్తంలో టిప్స్ ఇచ్చినట్లు పేర్కొంది. రూ.68,600 టిప్ గా చెల్లించి బెంగళూరు వాసులు గ్రేట్ అనిపించుకున్నారని ఇన్‌స్టామార్ట్‌ అభినందించింది.