Begin typing your search above and press return to search.

ఇదేంది ఇన్ఫోసిస్.. ఏడాదిలో ఇంతమందిపై వేటు వేసుడా?

తాజాగా ఇన్ఫోసిస్ దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో 25,994 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లుగా పేర్కొంది.

By:  Tupaki Desk   |   19 April 2024 6:30 AM GMT
ఇదేంది ఇన్ఫోసిస్.. ఏడాదిలో ఇంతమందిపై వేటు వేసుడా?
X

ఐటీ రంగానికి సంబంధించి అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ ఏడాది కాలంలో తమ ఉద్యోగులపై వేసి వేటు లెక్కలు షాకింగ్ గా మారాయి. కరోనా తర్వాత చోటు చేసుకున్న పరిస్థితుల్లో ఇటీవల కాలంలో పలు దిగ్గజ టెక్ సంస్థలు తమ ఉద్యోగుల్ని తగ్గించుకోవటం.. కొత్త వారిని చేర్చుకునే విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే.

తాజాగా ఇన్ఫోసిస్ దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలో 25,994 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లుగా పేర్కొంది. 23 ఏళ్ల కాలంలో కంపెనీ చరిత్రలో ఏడాది కాలంలో ఇంత భారీగా ఉద్యోగుల తొలగింపు జరగలేదని పేర్కొంది. 2001 తర్వాత ఏడాది వ్యవధిలో ఇంత భారీగా ఉద్యోగుల్ని తీసేసిన పరిస్థితి ఇప్పుడే ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం కంపెనీలో 3.17 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లుగా వెల్లడించారు.కొత్త రిక్రూట్ మెంట్ సైతం ఆశించినంతగా లేదు. ఈ జనవరి నుంచి మార్చి మూడు నెలల కాలంలో కేవలం 5423 మంది కొత్త ఉద్యోగుల్ని మాత్రమే చేర్చుకున్నారు. గడిచిన కొంత కాలంగా కంపెనీల లాభాలు తగ్గుదలతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఇక.. ఇన్ఫోసిస్ కంపెనీ క్యూ4 లాభాల విషయానికి వస్తే.. 2024 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో మంచి లాభాల్ని ఆర్జించినట్లుగా చెబుతున్నారు. కంపెనీ అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 30 శాతం లాభాలు పెరిగినట్లుగా సమాచారం.