Begin typing your search above and press return to search.

మూర్ఖత్వం పరాకాష్టకు... సొంత బిడ్డ ప్రాణం తీసిన ఇన్‌ ఫ్లుయెన్సర్‌!

ఈ క్రమంలో తాజాగా తన సొంత కొడుకుపై ప్రయోగాలు చేసి, ఆ పసిబిడ్డ మరణానికి కారకుడయ్యాడు ఓ ఇన్‌ ప్లుయెన్సర్‌!

By:  Tupaki Desk   |   17 April 2024 5:30 PM GMT
మూర్ఖత్వం పరాకాష్టకు... సొంత బిడ్డ ప్రాణం తీసిన ఇన్‌  ఫ్లుయెన్సర్‌!
X

ఫేమస్ అయిపోవాలనే ఆత్రంలో కొంతమంది సోషల్ మీడియా వేదుకగా చేస్తున్న చిత్ర విచిత్ర వ్యవహారాలు తీవ్ర వివాదాస్పదంగా మారూతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాల మీదకు వచ్చేలా కొందరి పనులుంటే... ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా మరికొందరి చేష్టలు ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన సొంత కొడుకుపై ప్రయోగాలు చేసి, ఆ పసిబిడ్డ మరణానికి కారకుడయ్యాడు ఓ ఇన్‌ ప్లుయెన్సర్‌!

అవును... ఇటీవల కాలంలో ఫేమస్ అయిపోవాలని భావిస్తూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఇన్ ఫ్లుయెన్సర్లు చేస్తున్న చేష్టలు తీవ్ర వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా.. రష్యాకు చెందిన ఓ ఇన్‌ ప్లుయెన్సర్‌ తన సొంత కొడుకుపై ప్రయోగాలు చేసి, మరణానికి కారకుడయ్యాడు. ఈ ఘటన ఏడాది క్రితం జరగగా.. తాజాగా నేరం రుజువు కావటంతో అతడికి శిక్ష పడింది. దీంతో ఈ విషయం మరోసారి వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... రష్యాకు చెందిన మాక్సిమ్‌ లైయుటీ సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్‌ గా ఉన్నాడు. ఈ సమయంలో అతడు పచ్చి కూరగాయలతో ప్రత్యేక డైట్‌ ల గురించి చెబుతూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసేవాడు. ఇందులో భాగంగా... మనిషి బతకడానికి అసలు ఆహారం అవసరం లేదని.. సూర్యరశ్మితోనే ఎంతకాలమైనా జీవించొచ్చని భ్రమపడ్డాడు. ఈ మేరకు సొంత కొడుకుపై ప్రయోగాలు మొదలుపెట్టాడు.

దీన్ని నిరూపించటం కోసం నెలలు నిండని తన కొడుకుపై ప్రయోగం ప్రారంభించాడు. ఈ సమయంలో... అతని భార్య భార్య ఎంత వారించినా లెక్కచేయని మాక్సిమ్‌... ఆ శిశువుకు పాలు పట్టొద్దని గట్టిగా హెచ్చరించేవాడు. ఇదే క్రమంలో... శిశువును ఎండలో మాత్రమే ఉంచాలని, అప్పుడే కోలుకుంటాడని మూర్ఖంగా వాదించేవాడని చెబుతున్నారు. ఈ సమయంలో బిడ్డ ఆరోగ్యం క్షీణిస్తున్నా.. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సహకరించేవాడు కాదట!

ఈ క్రమంలో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు ఎదురయ్యాయట. ఈ నేపథ్యంలో... ఎట్టకేలకు పలువురి ఒత్తిడి మేరకు బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి మాక్సిమ్‌ అనుమతించాడట. అయితే... అప్పటికే పరిస్థితి చేదాటిపోవడంతో.. చికిత్స పొందుతూ ఆ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో... విషయం తెలుసుకున్న పోలీసులు మాక్సిమ్‌ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కోర్టు విచారణ సందర్భంగా... తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లే అనారోగ్య సమస్యలతో బిడ్డ మరణించాడని వెల్లడించినా... ఆ బిడ్డ తల్లి మాత్రం జరిగింది మొత్తం కోర్టుకు వివరించింది. దీంతో... అతడిని దోషిగా తేల్చిన కోర్టు ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.