Begin typing your search above and press return to search.

ప్రియురాలి కోసం.. 47 ఏళ్ల పురుషుడిగా మారిన‌ మ‌హిళ.. నేడే పెళ్లి!

ఈ చిత్ర‌మైన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఇండోర్‌లో జ‌రిగింది. ఇండోర్‌కు చెందిన అల్కాసోనీ అనే మ‌హిళ‌కు ప్ర‌స్తుతం 47 ఏళ్ల వ‌య‌సు.

By:  Tupaki Desk   |   11 Dec 2023 5:02 AM GMT
ప్రియురాలి కోసం.. 47 ఏళ్ల పురుషుడిగా మారిన‌ మ‌హిళ.. నేడే పెళ్లి!
X

ప్రేమ గుడ్డిద‌ని అంటారు. అనేక సంద‌ర్భాల్లో ఇది నిజం కూడా అయింది. ఇప్పుడు మ‌రోసారి కూడా ఇది నిజం కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇది పురుష‌-స్త్రీ ప్రేమ‌కు సంబంధించింది కాదు. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు సంబంధించిన ప్రేమ‌. అది కూడా మ‌న దేశంలోనే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ప‌ర‌స్ప‌ర ఆక‌ర్షితులైన ఇద్ద‌రు మ‌హిళ‌లు ప్రేమించుకున్నారు. ఏకంగా వారు పెళ్లి కూడా చేసుకోవాల‌ని భావించారు. ఈ నేప‌థ్యంలో లింగ స‌మ‌స్య త‌లెత్తింది. దీంతో ప్రేమికుల్లో ఒక‌రు లింగ మార్పిడి చేయించుకుని, పురుషుడిగా మారిపోయారు.

ఈ చిత్ర‌మైన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఇండోర్‌లో జ‌రిగింది. ఇండోర్‌కు చెందిన అల్కాసోనీ అనే మ‌హిళ‌కు ప్ర‌స్తుతం 47 ఏళ్ల వ‌య‌సు. ఆమెకు ఒక సోద‌రి ఉంది. ఈ సోద‌రికి ఒక స్నేహితురాలు ఉంది. ఈమె వ‌ర‌కు 42 ఏళ్లు. త‌ర‌చుగా ఆ స్నేహితురాలు.. ఇంటికి వ‌స్తున్న క్ర‌మంలో అల్కాసోనీతోనూ ఆమెకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం.. కేవ‌లం 8 మాసాల్లోనే ప్రేమ‌గా మారింది. ఈ విష‌యం ఇరువురి ఇళ్ల‌లోనూ తెలిసిపోయి.. అస‌హ్యించుకున్నారు. దీంతో వారిరువురూ.. ఇండోర్‌లోనే మారు మూల ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని స‌హ‌జీవ‌నం ప్రారంభించారు.

ఇద్ద‌రు మ‌హిళ‌లు క‌లిసి స‌హ‌జీవ‌నం చేయ‌డంపై స్థానికంగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో అల్కాసోని.. తాజాగా లింగ మార్పిడి ఆప‌రేష‌న్ చేయించుకుని పురుషుడిగా మారిపోయింది. ఇలా ఇద్ద‌రూ క‌లిసి జీవించ‌డం వారికి ఇష్టం కావ‌డంతో స్థానిక ప్ర‌జ‌ల నుంచి కూడా వ్య‌తిరేక‌త త‌గ్గింది. ఈ క్ర‌మంలో తాజాగా ఫ్యామిలీ కోర్టును ఆశ్ర‌యించి.. ఇరువురూ.. చ‌ట్టం ప్ర‌కారం వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. ఈ నెల 11న(సోమ‌వారం) పెద్ద‌ల స‌మ‌క్షంలో ఘ‌నంగా వివాహం చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. దీంతో ఈ వార్త దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.