Begin typing your search above and press return to search.

ఇందిరా...వాజ్ పేయి...మోడీ...తేడా ఏమిటి ?

ఈ ముగ్గురు సమయంలో మూడు సార్లు పాక్ యుద్ధానికి వచ్చింది. ఇందులో అతి పెద్ద యుద్ధంగా 1971లో జరిగిన దానిని చెప్పుకోవాలి.

By:  Tupaki Desk   |   13 May 2025 11:00 PM IST
ఇందిరా...వాజ్ పేయి...మోడీ...తేడా ఏమిటి ?
X

ఈ దేశాన్ని ఎందరో ప్రధానులు పాలించారు. ఆధునిక భారతంలో బలమైన ప్రధానులుగా ముగ్గురు మాత్రమే కనిపిస్తారు. వారే శ్రీమతి ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్ పేయ్, నరేంద్ర మోడీ. ఈ ముగ్గురూ అత్యధిక కాలం ఈ దేశాన్ని ఏలిన వారుగా ఉన్నారు. ఇంకా చెప్పాలీ అంటే ప్రధానులుగా మూడు సార్లు ప్రమాణం చేసిన వారు కూడా వీరే కావడం విశేషం. వీరికి మరో సారూప్యత సైతం ఉంది. అదే భారత్ పాకిస్థాన్ ల మధ్య యుద్ధం

ఈ ముగ్గురు సమయంలో మూడు సార్లు పాక్ యుద్ధానికి వచ్చింది. ఇందులో అతి పెద్ద యుద్ధంగా 1971లో జరిగిన దానిని చెప్పుకోవాలి. ఆనాడు పాకిస్థాన్ చెవులు మూసి బంగ్లాదేశ్ అన్న ఒక కొత్త దేశాన్ని సృష్టించి ఇందిర పాక్ రెక్కలు విరిచేశారు. అలా ఆమె అపర దుర్గామాత గా ప్రపంచంలోనే ఎనలేని ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత 1999లో కార్గిల్ వార్ వచ్చింది. అపుడు బీజేపీ వరిష్ట నేత అటల్ బిహారీ వాజ్ పేయ్. ఆయన కూడా పాక్ పీచమణిచారు. దాయాదితో వచ్చిన యుద్ధంలో గెలుపు రుచి దేశానికి చూపించి హీరో ఇమేజ్ ని సాధించారు. సరిగా పాతికేళ్ళ తరువాత భారత్ ఇండియా మధ్య మరో పరిమిత యుద్ధం వచ్చింది. అది కాస్తా పెద్ద యుద్ధంగా మారే చాన్స్ ఉంది.

అయినా ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ సమయస్పూర్తితో కాల్పుల విరమణ ప్రకటించి యుద్ధాన్ని నివారించారు. అయితే ఇక్కడే చాలా మంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. భారత్ కి మంచి చాన్స్ వచ్చింది. ఈ దెబ్బతో ఇందిరా వాజ్ పేయ్ కంటే మిన్నగా మోడీ తన ఇమేజ్ ని పెంచుకోవచ్చు అని చరిత్రలో నిలిచేలా పాక్ కి గట్టి గుణపాఠం చెప్పవచ్చు అని అంతా అంటున్నారు.

నెటిజన్లు అయితే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడాన్ని ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మోడీ ప్రభుత్వం దూర దృష్టితో అన్నీ ఆలోచించే ఈ విధంగా చేసింది అని అంటున్నారు. యుద్ధం భారత్ లక్ష్యం కాదని ఉగ్ర శిబిరాలని అంతం చేయడమే ఉద్దేశ్యమని చెబుతున్నారు. అందువల్ల భారత్ ఎక్కడ ఆరంభించిందో అక్కడే ముగించింది అని చెబుతున్నారు.

కానీ భారత్ కి బంగారం లాంటి అవకాశం అని పాక్ మళ్ళీ లేవకుండా దెబ్బ తీసే చాన్స్ ని మోడీ మిస్ చేసుకున్నారని ఆ విధంగా ఆయన ఇందిరా వాజ్ పేయి సరసన ఉండాల్సింది జస్ట్ అలా దూరం అయింది అని అంటున్నారు. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజున కాల్పుల విరమణకు అంగీకరించి ఉండవచ్చేమో కానీ ఏదో రోజున పాక్ కి చరిత్రలో నిలిచిపోయే గుణపాఠం చెప్పి తీరుతుందని ఆయన జాతిని ఉద్దేశించి చేసిన స్పీచ్ తో లోకానికి అర్థం అయింది అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే పాక్ విషయంలో కాంగ్రెస్ బీజేపీ ప్రధానమంత్రులు ఎవరైనా పై చేయినే సాధించి దాయాదికి తన దారి చూపించారు అని అంటున్నారు. ఇకపోతే పాకిస్థాన్ విషయం తీసుకుంటే ఉగ్రవాదాన్ని అణు బాంబులను మాత్రమే నమ్ముకుంది. ఒక విధంగా నిప్పుల కుంపటి మీద ఆ దేశం కూర్చుని ఉంది. దానికి వేరే వారు వచ్చి అంటించాల్సిన అవసరం లేదని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల పాక్ తాను ఉన్న ప్రమాదకరమైన చోటుని గ్రహించి దానికి తగిన విధంగా వివేచనతో ప్రజల మేలు కోరే చర్యలకు ఉపక్రమిస్తే ఒక దేశంగా మిగిలి ఉంటుందని అంటున్నారు.

ఉగ్ర మూకలకు దూరంగా జరిగితే పాక్ కి భవిష్యత్తు అని అంతా అంటున్నారు. అలా కాదని పాక్ తోక జాడిస్తే ఈసారి మోడీ మూడో కన్ను తెరవడం ఖాయం. మరి ఆ అగ్నికీలలో దాయాది మాడి మసి అవుతుందా లేక ఇంకేమైనా జరుగుతుందా అంటే అది భవిష్యత్తు దర్శనమే అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ దేశం ఇందిరను, వాజ్ పేయ్ ని మోడీని చరిత్ర పుటలలో గుర్తుంచుకుంటుందని అంతా అంటున్న మాట. ఇక పాక్ మోడీ సర్కార్ తో ఎపుడైనా పెట్టుకుంటే ఆ రోజుతోనే మూడినట్లే అని అంటున్నారు.