Begin typing your search above and press return to search.

అసలే ఇండిగో.. బాదుడు ఛాన్సును ఎందుకు మిస్ చేసుకుంటుంది?

తాజా యుద్ధ ఉద్రిక్తతలతో విమాన ఇంధన ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే ఇలాంటి వేళ.. తమ మీద పడిన యుద్ధ భారాన్ని ప్రయాణికుల మీద వేసేందుకు అస్సలు మొహమాటపడని పరిస్థితి.

By:  Garuda Media   |   14 March 2026 9:41 AM IST
అసలే ఇండిగో.. బాదుడు ఛాన్సును ఎందుకు మిస్ చేసుకుంటుంది?
X

కొన్ని సంస్థలు ఉంటాయి. వాటి పేర్లు చెప్పినంతనే ఒకలాంటి పీలింగ్ మనసులోకి చప్పున ఫ్లాష్ అవుతుంది. భారతదేశంలో దిగ్గజ ఎయిర్ లైన్స్ సంస్థగా పేరున్న ఇండిగో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల మీద భారాన్ని మోపే ఏ చిన్న అవకాశాన్ని మిస్ చేసుకొని ట్రాక్ రికార్డు దాని సొంతం. ప్రతి ఒక్క సేవకు ఛార్జ్ చేసే తీరు కనిపిస్తుంది. అలాంటి విమాన సంస్థకు ప్రయాణికులకు బాదే అవకాశం ఉంటే అస్సలు ఆగుతుందా చెప్పండి.

ఇప్పటికే పశ్చిమాసియా యుద్ద ప్రభావం విమానయాన రంగాన్ని తాకిన సంగతి తెలిసిందే. తాజా యుద్ధ ఉద్రిక్తతలతో విమాన ఇంధన ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే ఇలాంటి వేళ.. తమ మీద పడిన యుద్ధ భారాన్ని ప్రయాణికుల మీద వేసేందుకు అస్సలు మొహమాటపడని పరిస్థితి. ఇప్పటికే ఎయిరిండియా తన విమాన టికెట్ ధరల మీద సర్ ఛార్జీ భారాన్ని మోపింది. దీన్ని సాకుగా తీసుకున్న ఇండిగో తన ప్రయాణికుల మీదా పెరిగిన ముడి చమురు భారాన్ని షేర్ చేయాలన్న ఆలోచన చేస్తోంది.

ఇందుకు తగ్గట్లే.. ఇండిగో బాదుడు ప్లాన్ సిద్ధమైంది. ఇండిగో ఫ్యూయల్ సర్ ఛార్జి పేరుతో ఒక్కో విమాన టికెట్ పై కనిష్ఠంగా రూ.425, గరిష్ఠంగా రూ.2300 వరకు అదనపు భారాన్ని మోపేందుకు వీలుగా సిద్ధమైంది. అంతేకాదు పెంచిన ఛార్జీలు మార్చి 14 (శుక్రవారం) నుంచే అమల్లోకి రావట గమనార్హం. దేశీయ విమాన టికెట్ మీద రూ.425 చొపప్పున.. మద్యప్రాచ్యం వెళ్లే ఫ్లైట్ టికెట్ ధరల్ని రూ.900చొప్పున వసూలు చేయనున్నారు.

అదే సమయంలో చైనా..పశ్చిమాసియాకు వెళ్లే విమానాలకు రూ.1800, యూరప్ వెళ్లే విమానాలకు రూ.2300 చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. అంతర్జాతీయంగా ఏటీఎఫ్ ధరలు పెంచటానికి ఎంత సమయం పడుతుంది? అన్న సందేహానికి గురి కాకుండానే.. పక్కా నిర్వాహణ వ్యవస్థను డెవలప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యుద్దంలో భాగంగా తనతో పని చేసే వారి బాగోగులు చూసుకోవటం కనిపిస్తుంది. ఇండిగో ప్రధాన పోటీదారు అయిన ఎయిరిండియా మార్చి 12న దేశీయ.. అంతర్జాతీయ మార్గాల్లో టికెట్లపై ఇంధన సర్ ఛార్జీలను పెంచిన వైనం తెలిసిందే. మొత్తంగా చూస్తే.. యుద్ధానికి ముందు ఎంతలా ఉన్నాయి? ప్రస్తుతం ఎంత ధరలు ఉన్నాయి? అన్నది చూస్తే.. భారీగా పెరిగిన వైనం కనిపిస్తుంది.మొత్తంగా యుద్దం కారణంగా విమానయాన సంస్థల టికెట్ ధరలు భారీగా పెంచేసినట్లుగా చెప్పక తప్పదు.