Begin typing your search above and press return to search.

'ఫ్లైట్ నడపడానికి పనికిరావు.. వెళ్లి చెప్పులు కుట్టుకో'.. ఏమిటీ ఘోరం?

ఇదే సమయంలో.. ఇటీవల కాలంలో చాలా మందిలో పాతుకుపోయిన కుల, మత పరమైన జాడ్యాలు కూడా పెరుగుతున్నాయి. ఈ దరిద్రాన్ని భారత్ నుంచి ఈ శతాబ్ధంలోనూ దూరం చేయకున్నాయి!

By:  Tupaki Desk   |   23 Jun 2025 4:06 PM IST
ఫ్లైట్ నడపడానికి పనికిరావు.. వెళ్లి చెప్పులు కుట్టుకో..  ఏమిటీ ఘోరం?
X

దేశం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతోందని.. ప్రపంచంలోనే మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని.. మన నేతలు ప్రసంగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఇటీవల కాలంలో చాలా మందిలో పాతుకుపోయిన కుల, మత పరమైన జాడ్యాలు కూడా పెరుగుతున్నాయి. ఈ దరిద్రాన్ని భారత్ నుంచి ఈ శతాబ్ధంలోనూ దూరం చేయకున్నాయి!

ఈ క్రమంలో ఇలాంటి కులం పేరు చెప్పి ఓ మనిషిని ట్రీట్ చేయడం, దూషించడం వంటి పైత్యాలకు సంబంధించిన ఘటనలు పలు వెలుగుచూస్తున్నాయి. ఇందులో రాజకీయాలు, ఉద్యోగాలు, ట్రైనింగ్ సెంటర్లు అనే తారతమ్యాలేవీ లేవు.. అన్ని చోట్లా ఈ రోగం ఉంది! ఈ క్రమంలో ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో కుల వివక్ష ఘటన కలకలం రేపింది.

అవును... ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో కుల వివక్ష ఘటన కలకలం రేపింది. ఇందులో భాగంగా... తనను ముగ్గురు ఇండిగో సీనియర్‌ అధికారులు కులం పేరుతో దూషించారని దళిత సామాజికవర్గానికి చెందిన ఓ శిక్షణ పైలట్‌ ఆరోపించారు. తన గుర్తింపును కించపరిచే లక్ష్యంతోనే అవమానించారని ఆయన చెప్పారు.

గురుగ్రాంలోని ఇండిగో ప్రధాన కార్యాలయంలో ఓ మీటింగ్‌ కు వెళ్లగా.. అక్కడ కెప్టెన్‌ రాహుల్‌ పాటిల్‌ సహా మరో ఇద్దరు సీనియర్లు తనపై మండిపడ్డారని శిక్షణ పైలట్‌ వెల్లడించారు. ఇందులో భాగంగా... "నువ్వు ఫ్లైట్ నడపడానికి పనికిరావు.. వెళ్లి చెప్పులు కుట్టుకో.. ఇక్కడ వాచ్ మెన్ గా కూడా పనికిరావు" అని దూషించారని ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా స్పందించిన బాధితుని తండ్రి... ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్ లైన్స్ సీఈఓ, ఎథిక్స్ కమిటీకి నివేదించినప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ అన్యాయాన్ని పరిష్కరించడానికి, తన కుమారుడి గౌరవం, హక్కులను కాపాడటానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు.

దీంతో.. ఈ విషయం ఒకసారిగా షాకింగ్ గా మారింది. మరోవైపు బాధితుని ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు జీరో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి గురుగ్రాంకు కేసు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో... గురుగ్రాం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు దర్యాప్తు చేపట్టారు.